రాష్ట్రంలో 41 వేలు దాటిన కరోనా కేసులు.. 396 మంది మృతి
రాష్ట్రంపై కొవిడ్ పంజా విసురుతూనే ఉంది. కొత్తగా 1676 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. 10 మంది మృతి చెందారు. 1296 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
కొందరిలో కొవిడ్ ఉన్నా.. పరీక్షల్లో నెగిటివ్..
కొందరిలో కొవిడ్ ఉన్నా.. పరీక్షల్లో మాత్రం నెగిటివ్‌గా వస్తోంది. వైరస్ లేదని ఊరట పొందుతుంటే.. లక్షణాలు కనిపిస్తుంటాయి. సీజనల్ వ్యాధులు కావచ్చులే అని అనుకునే అవకాశాలూ ఉన్నాయి. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ పరిస్థితి విషమించే అవకాశం ఉంది. ఆయాసంగా అనిపించినా... ఊపిరి అందకపోయినా.. కరోనాను.. ‘సీటీ స్కాన్’ ద్వారా నిర్ధారించవచ్చని నిపుణులు అంటున్నారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఆశలు పెంచిన ఆక్స్‌ఫర్డ్- వైరస్ నుంచి డబుల్ రక్షణ!
ప్రపంచమంతా కరోనా టీకా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. ఈ తరుణంలో బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు టీకా అభివృద్ధిలో ముందడుగు వేశారు. వారు రూపొందించిన వ్యాక్సిన్‌తో కరోనా వైరస్ నుంచి 'రెట్టింపు రక్షణ' లభిస్తుందని మానవులపై నిర్వహించిన తొలి దశ ప్రయోగాల్లో తేలింది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ప్రభుత్వ విద్య బలోపేతం.. వ్యవస్థల ప్రక్షాళన
ఆగస్టు 17 నుంచి ఇంజనీరింగ్ విద్యాసంవత్సరాన్ని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ చివరి సంవత్సరం పరీక్షలను నిర్వహించాలని.. విద్యాశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. విద్యా సంవత్సరం కోల్పోకుండా ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వం రూపొందిస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఐరాస వార్షిక సమావేశంలో నేడు మోదీ ప్రసంగం
ఐక్యరాజ్యసమితి వార్షిక సమావేశంలో నేడు ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. కొవిడ్ నేపథ్యంలో ప్రపంచదేశాల మధ్య ఉండాల్సిన సహకారంపై మోదీ మాట్లాడనున్నట్లు సమాచారం.మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..