ఈనెల నుంచేే అమలు
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల వేతనం పెంచుతూ... రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నెల వేతనం రూ.15 వేల నుంచి రూ. 28,719కి పెంపు చేస్తున్నట్లు వెల్లడించింది. జులై 1వ తేదీ నుంచి పెరిగిన వేతనం అమల్లోకి వస్తుందని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ఆ ఓఎంఆర్‌లను అనుమతించవద్దు
పోటీ పరీక్షల పత్రాల బబ్లింగ్‌లో తప్పులున్న సమాధాన పత్రాలను అనుమతించవద్దని హైకోర్టు (High court) ఆదేశించింది. టీఎస్‌పీఎస్సీ ఓఎంఆర్ (Tspsc Omr Sheet) పత్రాల్లో బబ్లింగ్ వివాదంపై హైకోర్టు తీర్పు ఇచ్చింది. వివిధ ఉద్యోగ నియామకాల ఓఎంఆర్ పత్రాల్లో బబ్లింగ్‌లో పొరపాట్లపై ఇవాళ విచారణ చేపట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ఎప్పుడైనా తప్పించుకోలేరు..!
కళ్లు ఉన్నోడు ముందు మాత్రమే చూస్తాడు.. అదే దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు.. ఓ చిత్రంలోని ఈ డైలాగ్ విజిల్స్ వేయించింది. అదేవిధంగా.. పగటి వేళ ట్రాఫిక్‌ను నియంత్రిస్తుంటాం.. రాత్రివేళ నిఘానేత్రాలతో పహారా కాస్తుంటాం అంటూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పెట్టిన ఓ పోస్టింగ్ సామాజిక మాధ్యమాల్లో నవ్వులు పూయిస్తుంది. అదేంటో మీరూ ఓ లుక్కేయండి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
సిక్సర్ కొట్టిన సిద్ధూ!
పంజాబ్ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలకంగా మారిన నవజోత్ సింగ్ సిద్ధూ.. ఇప్పుడు ఆ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా పగ్గాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో క్రికెటర్ నుంచి పీసీసీ చీఫ్ వరకు 'సిక్సర్ సిద్ధూ' ప్రయాణం సాగింది ఇలా.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
మహా నగరాలు గజగజ
ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు దిల్లీ, ముంబయి సహా పలు మహా నగరాల్లో జన జీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాలకు ధాటికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నివాస ప్రాంతాల్లోకి బురదతో కూడిన వరద ప్రవేశిస్తోంది. కొన్నిచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.