తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @ 7PM - Telugu top news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @ 7PM
టాప్​టెన్​ న్యూస్​ @ 7PM

By

Published : Jul 18, 2021, 6:59 PM IST

'ఐదేళ్లలో ఆరుగురికే!'

ఐదేళ్ల కాలం(2014-19)లో రాజద్రోహ చట్టం కింద దేశంలో 326 కేసులు నమోదయ్యాయని కేంద్రం హోం శాఖ తెలిపింది. అందులో ఆరుగురికి మాత్రమే శిక్ష పడినట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

స్తంభించిన జనజీవనం

భాగ్యనగరంలో జోరువాన(hyderabad rains) కురుస్తోంది. నగరంలోని పలు కాలనీలు జలమయం అయ్యాయి. వివిధ ప్రాంతాల్లో ఏకధాటి వర్షం కురిసి... రహదారులపై నీరు చేరింది. రోడ్లు జలమయం కావడంతో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఏపీలో కొవిడ్​ కేసులు

ఆంధ్రప్రదేశ్​లో కొత్తగా 2,974 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 24,708 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'ప్రజలకు హెచ్చరిక..!'

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో భారీ వర్షాలు పెను విషాదాన్ని మిగిల్చాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో 25 మంది మృత్యువాత పడ్డారు.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

సడెన్​ బ్రేక్​తో దక్కిన ప్రాణం!

ముంబయిలోని కల్యాణ్​ ప్రాంతంలో ఓ రైలు డ్రైవర్​ చాకచక్యంతో తృటిలో ప్రమాదం తప్పించుకున్నాడు వృద్ధుడు. రైల్వే ట్రాక్​​ దాటుతుండగా.. జరిగిన ఈ ఘటనలో లోకోఫైలట్​ అత్యవసర బ్రేకులు వేసి.. రైలు కింద ఇరుక్కున్న అతన్ని బయటకు తీశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

తొలి అంతరిక్ష యాత్రికుడిగా.!​

కేరళకు చెందిన ప్రసిద్ధ పర్యటకుడు సంతోశ్​ జార్జ్​ కులంగర అంతరిక్ష యాత్రకు(Space tourism) వెళ్లనున్నారు. ఇందుకు రిచర్డ్ బ్రాన్సన్​కి చెందిన వర్జిన్​ గెలాక్టిక్(virgin galactic) నౌకలో రోదసిలో పర్యటించడానికి టికెట్ బుక్ చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

అలా లేకపోతే సమస్యలా!

ఎప్పుడు ఖాళీ సమయం దొరికినా బెడ్​పై సేదతీరుతాం. అప్పుడప్పుడు మంచంపైనే కూర్చుని తింటాం. కానీ.. ఇది చాలా ప్రమాదకరమని చెబుతున్నారు బ్రిటన్​కు చెందిన ఓ సూక్ష్మజీవుల నిపుణుడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఇకనైనా పెట్రో ధరలు తగ్గేనా?

చమురు ఉత్పత్తి పెంపు విషయంలో ఒపెక్​లో కీలక దేశాలైన సౌదీ, యూఏఈ మధ్య విభేదాలు తొలగినట్లు తెలుస్తోంది. ఆదివారం జరిగిన ఒపెక్ సభ్య దేశాల సమాావేశంలో పూర్తి స్థాయి ఒప్పందం కుదిరినట్లు యూఏఈ ఇంధన మంత్రి తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఓడినా.. పతకం గెలిచారు.!

టోక్యో ఒలింపిక్స్​ జులై 23న ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తి చేశారు నిర్వాహకులు. ఈ నేపథ్యంలో గతంలో ఈ విశ్వ క్రీడల సందర్భంగా జరిగిన కొన్ని ఆసక్తికర సంఘటనల గురించి మీరూ తెలుసుకోండి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

సీక్రెట్​ చెప్పిన 'వకీల్​సాబ్​ సూపర్​ఉమెన్​'!

ప్రతివారం ఈటీవీలో ప్రసారమయ్యే 'జబర్దస్త్' లేటెస్ట్​ ప్రోమో అలరిస్తోంది. ఈ సారి 'వకీల్​సాబ్​ సూపర్​ఉమెన్' షోలో సందడి చేయగా.. హైపర్​ ఆది, చలాకీ చంటి చేసిన కామెడీ నవ్వులు పూయిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details