తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @ 7PM - Telugu top news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @ 7PM
టాప్​టెన్​ న్యూస్​ @ 7PM

By

Published : Jul 14, 2021, 6:59 PM IST

వ్యవసాయంపై మంత్రివర్గ ఉపసంఘం

రాష్ట్రంలో ధాన్యం నిల్వ సామర్థ్యం పెంచుకోవాలని సీఎం కేసీఆర్​ సూచించారు. వచ్చే ఏడాది ధాన్యం ఉత్పత్తి మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. గతే ఏడేళ్లలో తెలంగాణ వ్యవసాయ ప్రస్థానం, సాధించిన ప్రగతిపై బుధవారం జరిగిన కేబినెట్​ సమావేశంలో సీఎం కేసీఆర్​ ప్రస్తావించారు.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

హుజూరాబాద్​లో విజయం ఖాయం

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో రాష్ట్ర భాజపా నేతల భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలను ఆయనకు వివరించారు. పార్టీలో చేరిన తర్వాత అమిత్ షాను తొలిసారిగా ఈటల రాజేందర్ కలిశారు. ఉపఎన్నికలకు ముందే హుజూరాబాద్‌లో బహిరంగ సభకు ఆహ్వానించినట్లు నేతలు తెలిపారు.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'అధికారుల వేతనాలు వారికివ్వండి'

వృద్ధ దంపతులు రోడ్లు పూడ్చడంపై హైకోర్టులో విచారణ జరిగింది. పింఛను డబ్బుతో గుంతలు పూడుస్తున్నారన్న పత్రికా కథనంపై విచారణ చేపట్టిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం.. వృద్ధ దంపతులు మరమ్మతులు చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌'పై.. కీలక పరిణామం!

ఏపీ సీఎం జగన్‌ బెయిల్‌ రద్దు (Jagan's bail revocation) కోరుతూ ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌పై హైదరాబాద్‌ సీబీఐ కోర్టు (CBI COURT)లో మరోసారి విచారణ చేసింది. ఈనెల 8న జగన్, రఘురామకృష్ణరాజు తమ వాదనలను లిఖిత పూర్వకంగా న్యాయస్థానానికి సమర్పించారు.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఐదేళ్లకే పీఠాధిపతి.!

బాహుబలి సినిమాలో అప్పుడే పుట్టిన మహేంద్ర బాహుబలిని మహారాజుగా ప్రకటించింది శివగామి. అదే కోవలో కర్ణాటకలో ఓ ఐదేళ్ల బాలుడు పీఠాధిపతిగా నియమితుడై.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఓ ఐదేళ్ల బాలుడు.. పీఠాధిపతి అవ్వటం చరిత్రలో ఇదే మొదటిసారని పండితులు చెబుతున్నారు.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఫీజు రీఫండ్​పై కీలక ఆదేశాలు

సీబీఎస్​ఈ పరీక్షలు రద్దయిన నేపథ్యంలో.. విద్యార్థుల ఫీజు రీఫండ్​పై ఓ నిర్ణయం తీసుకోవాలని సీబీఎస్​ఈ బోర్డును ఆదేశించింది దిల్లీ హైకోర్టు(Delhi High Court). 8 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని తీర్పునిచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

విమానంలో చేపల వర్షం- ఎందుకిలా?

సరస్సుల్లో చేపల సంతతిని పెంచేందుకు వినూత్న ప్రయోగం చేసింది అమెరికా. ఉటాలో వేలాది చేప పిల్లలను విమానంలో తీసుకొచ్చి, ఎంతో ఎత్తు నుంచి సరస్సులో వదిలేశారు అధికారులు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఒప్పొ రెనో 6 వచ్చేసింది.!

భారత మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్​ఫోన్​ను విడుదల చేసింది ఒప్పొ. రెనో సిరీస్​కు కొనసాగింపుగా.. రెనో 6, రెనో 6ప్రో వంటి వేరియంట్లను బుధవారం ఆవిష్కరించింది. ఈ రెండు వేరియంట్ల ఫీచర్లు, ధర వివరాలు మీకోసం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఈ స్టార్ ప్లేయర్స్​ను చూడలేం!

మరికొద్ది రోజుల్లో టోక్యో ఒలింపిక్స్ సమరం ప్రారంభంకానుంది. తమ అభిమాన క్రీడాకారుల ఆటను చూసేందుకు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. కానీ కొందరు స్టార్ ప్లేయర్స్ లేకుండానే ఈసారి విశ్వక్రీడలు జరగనున్నాయి. సైనా నెహ్వాల్​తో పాటు ఫెదరర్, నాదల్, నెయ్​మర్​ వంటి అథ్లెట్లు మెగాటోర్నీలో పాల్గొనట్లేదు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'ఆర్ఆర్ఆర్' కౌంట్​డౌన్..!

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో ఆర్ఆర్ఆర్, హైవే, మాస్ట్రో, ఒకే ఒక జీవితం, ఎస్.ఆర్.కల్యాణ మండపం, సెబాస్టియన్ చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details