పెరిగిన రికవరీ రేటు
రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 97.77 శాతానికి చేరింది. కొత్తగా 65,607 పరీక్షలు నిర్వహించగా... 465 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,31,683కు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
రాష్ట్రంపై ప్రభావమెంత?
ఈరోజు ఉదయం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతం పరిసరాలలోని ఉత్తర ఆంధ్రా, దక్షిణ ఒడిశా తీరం దగ్గర అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
అందుకే బోనాలు ప్రత్యేకం
తెలంగాణలో బోనాల సంబురం షురూ అయింది. నేటి నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
' ఆ ఎస్పీని బదిలీ చేయొద్దు'
ఆంధ్ర - ఒడిశా సరిహద్దులోని తమ గ్రామాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన మల్కాన్‌గిరి ఎస్పీ రిషికేష్ కిల్లారిని బదిలీ చేయవద్దంటూ ఆ ప్రాంత గిరిజను ర్యాలీ నిర్వహించారు. మావోల ప్రాబల్యాన్ని తగ్గించి మౌలిక వసతులు కల్పించిన ఆయన... మరికొంత కాలం తమ ప్రాంతంలోనే ఉండాలని వారు కోరుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కరోనాను జయించి.. ఎవరెస్టు ఎక్కి.!
ఆత్మవిశ్వాసం తోడుంటే.. ఎన్ని వైరస్లు అడ్డొచ్చినా అనుకున్నది సాధించొచ్చని నిరూపించాడు ఓ వ్యక్తి. కరోనా నుంచి కోలుకున్న ఏడు వారాల్లోనే.. ఎవరెస్టును అధిరోహించాడు. తన కల నెరవేరేందుకు సహకరించిన కళాశాలకు వినూత్నంగా కృతజ్ఞతలు తెలిపాడు. ఇంతకీ అతనెవరు? ఏం చేశాడంటే..? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.