వైఎస్‌ఆర్ సంక్షేమ పాలనే లక్ష్యం
వైఎస్‌ఆర్ చెరగని చిరునవ్వు.. కోట్లాది ప్రజల్లో నిలిచిన సంక్షేమమే లక్ష్యంగా వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీని ఆవిష్కరిస్తున్నట్లు షర్మిల తెలిపారు. వైఎస్‌ఆర్ పుట్టిన రోజునే పార్టీ ప్రకటించడం ఆనందదాయకంగా ఉందన్నారు. రాజన్న సంక్షేమ పాలన తీసుకొచ్చేందుకే వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
తండ్రి కల సాకారం చేసేందుకే.!
తండ్రి కలలు సాకారం చేసేందుకే షర్మిల రాజకీయాల్లోకి వచ్చారని వైఎస్ విజయమ్మ అన్నారు. తెలంగాణలో వైఎస్‌ఆర్ పాలనకు పునాదులు పడబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ ఆవిష్కరణ సభలో పాల్గొని ప్రసంగించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
జగన్ బెయిల్ రద్దు విచారణ వాయిదా
ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. గత విచారణ సమయంలో.. లిఖితపూర్వక వాదనలు సమర్పించాలన్న కోర్టు ఆదేశాలతో.. జగన్, రఘురామ లిఖితపూర్వక వాదనలు సమర్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఆ ప్రాజెక్టులను నిలువరించాలి
కృష్ణానదిపై తెలంగాణ రాష్ట్రం చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులను నిలువరించాలని కోరుతూ కేంద్ర జలశక్తి శాఖకు ఏపీ జలవనరులశాఖ కార్యదర్శి లేఖ రాశారు. ఈ ప్రాజెక్టులతో ఏపీకి దక్కాల్సిన నీటి వాటాను తెలంగాణ కాజేస్తోందని లేఖలో ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కొత్త మంత్రుల తొలిరోజు ఇలా..!
మంత్రివర్గ పునర్వవస్థీకరణలో భాగంగా బుధవారం కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన నేతలు ఇవాళ వారివారి శాఖల బాధ్యతలు స్వీకరించారు. ప్రధాని నరేంద్ర మోదీ విజన్‌కు అనుగుణంగా పనిచేస్తూ తమపై ఉంచిన నమ్మకాన్ని.. నిలబెట్టుకుంటామని బాధ్యతలు చేపట్టిన తర్వాత చెప్పారు. దేశాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషిచేస్తామని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.