మోదీ నయా టీమ్
రాష్ట్రపతి భవన్‌లో కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తున్నారు. శర్బానంద సోనోవాల్, వీరేంద్ర కుమార్, నారాయణ్ రాణే, జ్యోతిరాదిత్య సింధియా, రామచంద్ర ప్రసాద్ సింగ్, అశ్వనీ వైశ్ణవ్, పశుపతి పరాస్‌లు.. కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
సంచలనం సృష్టించి..!
మధ్యప్రదేశ్, బిహార్ రాజకీయాల్లో సంచలనాలు సృష్టించిన జ్యోతిరాదిత్య సింధియా, పశుపతి కుమార్ పరాస్‌కు ప్రధాని నరేంద్ర మోదీ నూతన కేబినెట్లో చోటు దక్కింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కీలక నేతలు ఔట్- ఎందుకిలా?
కేంద్ర కేబినెట్ విస్తరణకు ముందే పలువురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. కేబినెట్ మంత్రులైన రమేశ్ పోఖ్రియాల్, సదానంద గౌడ, హర్షవర్ధన్, ప్రకాశ్ జావడేకర్, రవిశంకర్ ప్రసాద్.. రాజీనామా సమర్పించారు. మొత్తం 12 మంది మంత్రుల రాజీనామాలను రాష్ట్రపతి ఆమోదించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'2023లో అధికారం మాదే'
టీపీసీసీ నూతనాధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్, సీఎల్పీనేత భట్టి విక్రమార్క... కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది.. సోనియాగాంధేనని.. 2023లో రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకునేది కాంగ్రెసేనని ధీమా వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఆ విషయంలో జోక్యం చేసుకోలేం
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిపింది. ఆన్‌లైన్‌లో క్లాస్‌లు.. ఆఫ్‌లైన్‌లో పరీక్షలు పెడుతున్నారన్నని న్యాయవాదులు తెలిపారు.