తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @ 7PM - Telugu top news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @ 7PM
టాప్​ టెన్​ న్యూస్​ @ 7PM

By

Published : Jul 4, 2021, 7:01 PM IST

రాష్ట్ర ప్రభుత్వం లేఖ

తెలంగాణ ప్రభుత్వం తన హక్కుగా వచ్చిన నీటితోనే చట్టం, ట్రైబ్యునల్ ఆదేశాలకు లోబడి శ్రీశైలం వద్ద విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని... ఇందులో ఆంధ్రప్రదేశ్​కు ఎలాంటి అభ్యంతరాలు అక్కర్లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఫ్రెండ్లీ పోలీసింగ్​

పోలీస్‌స్టేషన్‌ అంటేనే సాధారణంగా జనాలకు ఏదో తెలియని భయం. ఠాణా మెట్లు ఎక్కాలంటేనే జంకే పరిస్థితి ఒకప్పుడు ఉండేది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏడేళ్లలో పోలీస్‌ శాఖలో ఎన్నో సంస్కరణలు అమలు చేశారు పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

యాదాద్రిలో సీజే

యాదాద్రీశుడి సేవలో హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ పాల్గొన్నారు. శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పరిసరాలను పరిశీలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

' ఒకే ఇంట్లో నలుగురు...'

కూతురు ప్రేమ వ్యవహారం నచ్చని ఓ తండ్రి నలుగుర్ని హత్యచేశాడు. ఈ దారుణ ఘటన పంజాబ్​లోని గురుదాస్​పుర్​ జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ధామీ ప్రమాణస్వీకారం

ఉత్తరాఖండ్​ సీఎం పీఠాన్ని పుష్కర్ సింగ్ ధామీ అధిరోహించారు. గవర్నర్ సమక్షంలో సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'రఫేల్ డీల్​'​పై రాహుల్​

రఫేల్ ఒప్పందంపై రాహుల్​ మరోసారి కేంద్రంపై నిప్పులు చెరిగారు. జేపీసీ దర్యాప్తునకు కేంద్రం ఎందుకు సిద్ధంగా లేదో చెప్పాలని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

నాన్నా ఎప్పుడొస్తావ్?

తల్లిదండ్రులు ఒక్క నిమిషం కనిపించకపోయినా చిన్నారులు అల్లాడిపోతుంటారు. స్కూటర్​ సౌండో, కారు సౌండో వింటే చాలు.. డాడీ వచ్చాడంటూ కేరింతలతో బయటకు పరుగులు తీస్తారు. కర్ణాటకకు చెందిన చిన్నారి సమ్య.. తన తండ్రి మరణించాడని తెలియక రోజూ ఫోన్​ చేస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

సైనా ట్వీట్ దుమారం

బ్యాడ్మింటర్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ చేసిన ఓ ట్వీట్​పై మండిపడుతోంది రాష్ట్రీయ లోక్​ దళ్ పార్టీ. సైనాపై తీవ్ర విమర్శలు చేస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

రూ.15 వేలలో ఫోన్ కొనాలా?

స్మార్ట్​ఫోన్​ కొనాలనుకునే వారికి ప్రస్తుతం చాలా ఆప్షన్​లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా భారీ ఫీచర్లు ఉన్న ఫోన్లు కూడా తక్కువ ధరలోనే దొరుకుతున్నాయి. ఇలా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బెస్ట్​ బడ్జెట్ స్మార్ట్​ఫోన్ల ఫీచర్లు, ధరల వివరాలు మీకోసం.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కొత్త జట్టుతో లంక!

జాతీయ కాంట్రాక్టుపై సంతకాలు చేయని ఆటగాళ్లను భారత్​తో జరగబోయే సిరీస్​కు పక్కనపెట్టాలని శ్రీలంక క్రికెట్​ బోర్డు(Sri Lanka cricket board) భావిస్తోంది. కేవలం కాంట్రాక్ట్​కు అంగీకారం తెలిపిన ప్లేయర్స్​నే తీసుకుని కొత్త జట్టును ఆడించాలని చూస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details