నీటిపారుదలపై సీఎం కేసీఆర్ సమీక్ష
ఏపీతో కృష్ణా జలాల వివాదం నేపథ్యంలో నీటిపారుదలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఈఎన్సీతో సమావేశమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
' చుక్క నీరు పోనివ్వం '
ఏపీ అక్రమ ప్రాజెక్టుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కఠినంగా వ్యవహరించనున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జలవనరుల విషయంలో చుక్క నీరు నష్టపోకుండా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని కించపరిచేలా ఎవరైనా మాట్లాడితే పార్టీలకతీతంగా అందరూ ఏకతాటిపై నిలబడాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'డబ్బులిచ్చి కొనుక్కున్నాడు'
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తెరాస ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, సుధీర్ రెడ్డి విరుచుకుపడ్డారు. రాళ్లతో కొట్టాలని ఒక ఎంపీ చెప్పడం దారుణమన్నారు. రేవంత్ రెడ్డి.. నిషేధిత మావోయిస్టుల భాష మాట్లాడుతున్నారని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
అమరిందర్ భేటీ
పంజాబ్ కాంగ్రెస్లో (Punjab congress) ఏర్పడ్డ అభిప్రాయభేదాలను పరిష్కరించే దిశగా ఆ రాష్ట్ర సీఎం అమరిందర్ సింగ్(Amarinder singh).. పార్టీ అధిష్ఠానంతో భేటీ కానున్నారు. సిద్ధూకు పార్టీలో కీలక హోదా కట్టబెట్టడం సహా ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు అంగీకరిస్తూ అధిష్ఠానంతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
అర్ధరాత్రి మూకదాడి!
అర్ధరాత్రి ఆటోలో వెళ్తున్న ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు ఓ ఆటో డ్రైవర్. సాయం కోసం ఆ యువతి తన ఇద్దరు మిత్రులకు సమాచారం అందించింది. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన మిత్రులను, యువతిని.. కొందరు గ్రామస్థుల సాయంతో చితకబాదాడు ఆ ఆటోడ్రైవర్ . పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.