రికవరీ రేటు పెరిగింది
కరోనా మహమ్మారి రెండో దశ ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఏప్రిల్, మే నెలల్లో కేసుల సంఖ్య బాగా పెరిగినా.. లాక్డౌన్, ప్రజల అప్రమత్తతతో క్రమంగా తగ్గుముఖం పట్టాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
రేట్లు పెంచేద్దాం
భూముల రిజిస్ట్రేషన్ విలువలను పెంచాలని.. మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న భూముల విలువల సవరణకు ప్రతిపాదనలు పంపింది. వెంటనే సవరణ చేపట్టాల్సిన అవసరం ఉందని మంత్రివర్గ ఉపసంఘం పేర్కొంది. రాష్ట్ర ఆవిర్భావం నాటి నుంచి రిజిస్ట్రేషన్ విలువల్లో సర్కారు ఎటువంటి మార్పులు చేయలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
భాగ్యనగరంలో భారీ వర్షం
ఉపరితల ఆవర్తన ప్రభావంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వానతో వివిధ పనుల నిమిత్తం బయటికొచ్చిన ప్రజలు తడిసిముద్దయ్యారు. రహదారులపై నీరు నిలిచి వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఫలితాలపై కమిటీ
ఏపీ ఇంటర్మీడియట్ రెండో ఏడాది ఫలితాల విడుదలకు అనుసరించాల్సిన విధివిధానాలపై సిఫార్సు చేసేందుకు ఇంటర్ విద్యామండలి ఉన్నత స్థాయి అధికారుల కమిటీ ఏర్పాటు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మోదీ కీలక భేటీ
ప్రధాని మోదీ.. హోంమంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహా దారు అజిత్ దోభాల్‌తో భేటీ అయ్యారు. ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో ఏ విషయాలను చర్చిస్తున్నారన్నదానిపై అధికారిక సమాచారం లేనప్పటికీ జమ్ముకశ్మీర్‌లో డ్రోన్ దాడుల ముప్పు నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఆ తర్వాతే రెండో డోసు
టీకా డోసుల మధ్య వ్యవధి ఎంతుంటే మంచిదనే అంశంపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. దేశంలో ఇప్పుడు కొవిషీల్డ్‌కు 12-16 వారాల సమయం ఉండగా.. కొవాగ్జిన్ రెండో డోసును 4-6 వారాల అంతరం ఉంది. అయితే.. కొవిషీల్డ్ రెండో డోసు 45 వారాల తర్వాత తీసుకుంటే.. రోగ నిరోధక వ్యవస్థ మరింత బలంగా తయారవుతుందని ఓ అధ్యయనం చెబుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మాజీ దేశాధ్యక్షుడికి జైలు
కోర్టు ధిక్కరణ కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమాకు 15 నెలల జైలు శిక్ష విధించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
పార్లమెంట్ కమిటీ ప్రశ్నల వర్షం
ఐటీ వ్యవహారాలపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఎదుట హాజరయ్యారు ఫేస్‌బుక్ ఇండియా, గూగుల్ ప్రతినిధులు. సామాజిక మాధ్యమాల దుర్వినియోగం అంశంపై కమిటీ వారిని ప్రశ్నించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
అందుకే అక్కడ దాక్కున్నా.!
డబ్ల్యూటీసీ ఫైనల్ చివరి రోజున తనకు జరిగిన వింత అనుభవం గురించి కివీస్ ఆల్‌రౌండర్ జేమీసన్ చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నెమ్మదిగా ఆడడం వల్ల తాను కాస్త ఆందోళనకు గురైనట్లు పేర్కొన్నాడు. దానిని అధిగమించడానికి బాత్రూంలో దాక్కున్నానని వెల్లడించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
అతనెవరు?
బుల్లితెర రియాలిటీ షో బిగ్బాగ్ ఐదో సీజన్(Bigg Boss Telugu Season 5) వ్యాఖ్యాతగా టాలీవుడ్‌లోని ఓ విలక్షణ నటుడ్ని ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అనేక సినిమాల్లో విభిన్న పాత్రలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నటుడు రానా దగ్గుబాటి(Rana Daggubati).. రాబోయే బిగ్‌బాస్ సీజన్లో హోస్ట్‌గా వ్యవహరించనున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.