తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @7PM - Telugu top ten news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​టెన్​ న్యూస్​ @7PM
టాప్​టెన్​ న్యూస్​ @7PM

By

Published : Jun 26, 2021, 6:54 PM IST

Updated : Jun 26, 2021, 7:07 PM IST

  • కొత్త లేఅవుట్లు అనుమతించవద్దు..

పల్లెప్రగతి, పట్టణప్రగతిపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. పట్టణాల వారీగా క్లీనింగ్ ప్రొఫైల్ రూపొందించాలని ఆదేశించారు. విశ్రాంత ఉద్యోగులు, మాజీ సైనికుల జాబితా రూపొందించి.. వారి సేవలను పల్లె, పట్టణప్రగతిలో వాడుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కొత్తగా 1,028 కేసులు..

తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. తాజాగా రాష్ట్రంలో 1,028 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి మరో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • రేపు భారీ వర్షాలు..

తెలంగాణలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • సీఎం కేసీఆర్​కు చిత్తశుద్ధి లేదు..

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్​కు చిత్తశుద్ధి లేదని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. ఏపీ ప్రభుత్వంతో కేసీఆర్​ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని వ్యాఖ్యానించారు. మహబూబ్​నగర్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అరుణ విమర్శలు గుప్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'స్మార్ట్​ఫోన్' మన మాటలు వింటోందా?

గూగుల్​లో మీరు దేని గురించైనా శోధిస్తే, ఆ తర్వాత ఏ వెబ్‌సైట్‌ తెరిచినా.. మొదట సర్చ్​ చేసిన విషయానికి సంబంధించిన వార్తలు, ప్రకటనలే కనిపిస్తున్నాయా? ఇంకా మీరేదైనా ఆర్డర్​ చేయాలని ఇంట్లోవారు/ స్నేహితులతో గట్టిగా మాట్లాడి ఫోన్​ ఓపెన్​ చేస్తే.. సంబంధిత ప్రకటనలే వస్తున్నాయా? ఒక్కసారిగా.. ఫోన్​ మీ మాటలు వింటుందనిపించి మీరు ఆశ్చర్యపడీ ఉండొచ్చు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • టీకా పంపిణీ ఎలా సాగుతోంది?

దేశంలో కొనసాగుతున్న కొవిడ్​ వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. ఉన్నతస్థాయి అధికారులతో శనివారం చర్చలు జరిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • తాజ్​​ హోటల్​కు బాంబు బెదిరింపు..

ముంబయిలోని ఇండియా గేట్​కు సమీపంలో ఉన్న తాజ్​ హోటల్​కు శనివారం.. బాంబు బెదిరింపు ఫోన్​ కాల్​ వచ్చింది. సమాచారం అందుకున్న వెంటనే ముంబయి పోలీసులు భారీగా మోహరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • పాత నాణేలతో ధనికులవ్వండి..

లక్షలు సంపాదించాలంటే.. విపరీతంగా కష్టపడాల్సిన పనిలేదు. ఎవరినో బురిడీ కొట్టి సంపాదించాల్సిన పని ముమ్మాటికీ లేదు. 25 పైసలుంటే చాలు.. ఇది వినగానే ఆశ్చర్యం కలిగింది కదూ!. మరి ఇంత తక్కువ డబ్బుతో లక్షలు ఎలా సంపాదించవచ్చో తెలుసుకోండి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఖేల్​రత్న రేసులో స్టార్​ హాకీ ప్లేయర్లు..

క్రీడా పురస్కారాల కోసం నామినేషన్లను ప్రకటించింది హాకీ ఇండియా. ప్రతిష్ఠాత్మక రాజీవ్​ గాంధీ ఖేల్​రత్నకు స్టార్ ప్లేయర్లు శ్రీజేశ్, దీపిక పేర్లను సిఫార్సు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఎన్టీఆర్ బెస్ట్ డ్యాన్సర్..

నందమూరి హీరోలు బాలకృష్ణతో 'వీరభద్ర', ఎన్టీఆర్​తో 'నాగ' సినిమాలు చేసిన సదా.. వారి గురించి చెప్పింది. అలానే మరిన్ని ఆసక్తికర విషయాల్ని 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

Last Updated : Jun 26, 2021, 7:07 PM IST

ABOUT THE AUTHOR

...view details