- సెకండ్ వేవ్‌తో జాగ్రత్తగా ఉండాలి..
కరోనా మొదటి వేవ్‌కు, రెండో వేవ్‌కు చాలా తేడా ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. రెండో దశలో వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతున్నందున వైద్యులు, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో టెలీ-కాన్ఫరెన్స్ నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మాస్క్ లేకపోతే జరిమానా..
మాస్కు పెట్టుకోకపోతే ఏముంది... నన్ను ఎవరు చూస్తారులే అనుకుంటే... మీరు తప్పులో కాలేసినట్టే!! మీరు మాస్కు పెట్టుకున్నారా...? లేదా? అనే నిఘా మీపై ఉంటుంది. అదేలా అనుకుంటున్నారా..? మాస్క్ లేనివారిని సీసీ కెమెరాలతో గుర్తించి జరిమానా విధిస్తున్నారు రాచకొండ పోలీసులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సైకిల్‌పై సోనూసూద్!
సోనూ సూద్ .. ఇది పరిచయం అక్కర్లేని పేరు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల మదిలో ఉండిపోయిన పేరు. కరోనా మహమ్మారి కాటేసిన వేళలో వేలాది మంది దిక్కుతోచక రోడ్ల మీద కాలినడకన స్వస్థలాలకు వెళ్తుంటే.. వారిని స్వచ్ఛందంగా ఆదుకున్న సోనూసూద్ సహాయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ సోనూ సూదే హైదరాబాద్‌లో సైకిల్‌పై సందడి చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రాగల మూడు రోజులు వర్షాలు..
ఉత్తర తెలంగాణ జిల్లాలు మినహా అన్ని చోట్లా రాగల మూడు రోజులు వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం, గాలి విచ్ఛిన్నతి వల్లే రాష్ట్రంలో వర్షాలని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వీహెచ్ దీక్షకు మద్దతు..
పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుకు డిమాండ్ చేస్తూ.. కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మూడో రోజుకు చేరింది. అంబర్‌పేటలోని తన నివాసం వద్ద దీక్షకు దిగిన వీహెచ్‌ను.. నేడు పలువురు నేతలు కలిశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కరోనా వ్యాప్తికి భాజపా కుట్ర..