తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @7PM - top ten news till now

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @7PM
టాప్​టెన్​ న్యూస్​ @7PM

By

Published : Apr 4, 2021, 6:59 PM IST

  • ఎన్నికల ప్రచారానికి తెర..

ఏప్రిల్​ 6న పోలింగ్ జరగనున్న వేర్వేరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రచార గడువు ముగిసింది. ఓటింగ్​ నిర్వహించేందుకు ఈసీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • నక్సలైట్ల ముప్పేట దాడి!

ఛత్తీస్​గఢ్​ దండకారణ్యం తుపాకీ మోతలతో దద్దరిల్లింది. తమకు పట్టున్న ప్రాంతంలోకి వచ్చిన భద్రతా సిబ్బందిపై మావోయిస్టులు కాల్పులతో పేట్రేగిపోయారు. మూడు వైపుల నుంచి కమ్ముకొని దళాలపై దాడికి తెగబడ్డారు. నక్సల్స్‌ దాడికి భద్రతా దళాలు దీటుగా స్పందించడం వల్ల అటు మావోయిస్టులూ చివరకు ప్రాణ నష్టంతో తిరిగివెళ్లిపోయినట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • వారాంతపు లాక్​డౌన్..

మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి ఆందోళనకరంగా మారుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో వారాంతపు లాక్​డౌన్​ విధిస్తున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఈటలకు గవర్నర్​ ఫోన్..

రాష్ట్ర గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్ వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​కు ఫోన్​ చేశారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • తెరాసకు సర్పంచ్ రాంరాం..

తెరాస నాయకుల వైఖరి వల్ల ఇబ్బందులు పడుతున్నట్లు ఆరోపిస్తూ రూపిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ బండారి కవితా దేవేందర్ తెరాస పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి కారణాలు వివరిస్తూ మర్యాద పూర్వకంగా లేఖ రాశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలి..

తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్​లు లేకనే నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్​ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ప్రేమించిన వ్యక్తిని మర్చిపోలేకపోతున్నారా..?

'ప్రేమనేది లైఫ్‌లో చిన్న పార్టే కానీ ప్రేమే లైఫ్ కాదు..' శంకర్‌దాదా ఎంబీబీఎస్ సినిమాలో చిరంజీవి చెప్పిన ఈ డైలాగ్ గుర్తుందా? ప్రేమే జీవితం కాకపోయినా... ప్రేమలో విజయం సాధిస్తే ఎంత ఆనందం మన సొంతమవుతుందో.. ఒకవేళ అందులో విఫలమైతే.. అంతకంటే రెట్టింపు విషాదం మనల్ని చుట్టుముడుతుంది. ప్రేమించిన వ్యక్తిని, వారి సాహచర్యంలో చోటుచేసుకున్న సంఘటనలను మర్చిపోవడం అంత సులభం కాదు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కరోనా 2.0: ఆ రాష్ట్రాలకు కేంద్ర బృందాలు..

దేశవ్యాప్తంగా కొవిడ్ ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వైరస్​ వ్యాప్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు కేంద్ర బృందాలను పంపాలని నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • అదే మాకు ప్లస్ పాయింట్..

ఇండియన్ ప్రీమియర్ లీగ్​లో ఈసారి తమ జట్టు సత్తా చాటుతుందని, కప్పు గెలవాలనే ఒక్క లక్ష్యంతో ఉన్నామని దిల్లీ క్యాపిటల్స్ సహాయ కోచ్​ కైఫ్ చెప్పాడు. తన తొలి మ్యాచ్​లో దిల్లీ, చెన్నైతో తలపడనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • రజనీ సినిమా రీమేక్​..

సూపర్​స్టార్​ రజనీకాంత్, శ్రీదేవి కలిసి నటించిన 'చాల్‌బాజ్‌' చిత్రానికి ఇప్పుడు రీమేక్​ రానుంది. ఇందులో ప్రధానపాత్ర కోసం స్టార్​ హీరోయిన్ శ్రద్ధా కపూర్​ను ఎంపికచేసినట్లు చిత్ర నిర్మాణసంస్థ ప్రకటించింది. ఈ సినిమాలో శ్రద్ధా కపూర్​ ద్విపాత్రాభియం చేయనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details