- 'ముహురత్' ట్రేడింగ్..
దీపావళికి భారత స్టాక్ మార్కెట్లు నిర్వహించే ప్రత్యేక ముహురత్ ట్రేడింగ్ ప్రారంభమైంది. ముహురత్ ట్రేడింగ్ అనేది చాలా సంవత్సరాల నుంచి కొనసాగుతోన్న సంప్రదాయం. ముహురత్ ట్రేడింగ్ మొదట బాంబే స్టాక్ ఎక్స్చేంజీలో 1957లో ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నలుగురు గల్లంతు..
ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాత మరిశాలలో పండుగ పూట విషాదం నెలకొంది. గోదావరి నదిలో ఈతకు వెళ్లి నలుగురు యువకులు గల్లంతయ్యారు. పుట్టినరోజు పార్టీ కోసం 20 మంది యువకులు మరిశాల సమీపంలోని గోదావరి నది వద్దకు వెళ్లారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఇద్దరు గల్లంతు..
సరదాగా దోస్తులతో కలిసి ఈతకు వెళ్లిన వారిని మృత్యువు కబళించింది. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద స్నేహితులతో కలిసి స్నానానికి వెళ్లిన ఇద్దరు గల్లంతయ్యారు. ప్రమాదవశాత్తు నీటిలో పడి మునిగిపోయారు. వారిలో ఒకరి మృతదేహం లభ్యం కాగా...మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కొనసాగుతున్న వేట..
కుమురం భీం జిల్లా దహేగం మండలం దిగిడ అటవీప్రాంతంలో పెద్దపులి కోసం వేట కొనసాగుతోంది. మూడు రోజుల క్రితం ఓ పశువుల కాపారిని హతమార్చిన పులిని బంధించేందుకు అటవీ అధికారులు పలు చర్యలు చేపట్టారు. అప్పటి నుంచి అధికారులు గాలిస్తోన్నా... పెద్దపులి జాడ మాత్రం అధికారులకు తెలియరావటం లేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మంచి మార్గంలో నడవాలి..
జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా సైదాబాద్‌లోని ప్రభుత్వ బాలుర హోమ్‌లో నిర్వహించిన వేడుకలకు గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో పిల్లలతో కలిసి సరదాగా గడిపారు. మంచి మార్గంలో నడిచి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని బాలలకు సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ముంచేసిన కరోనా..