తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్‌టెన్‌ న్యూస్‌ @7PM - టాప్‌టెన్‌ న్యూస్‌ @7PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @7PM
టాప్‌టెన్‌ న్యూస్‌ @7PM

By

Published : Nov 12, 2020, 6:55 PM IST

  • రేపు మంత్రి వర్గ సమావేశం..

రేపు రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది. ప్రగతి భవన్​లో సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశం జరగనుంది. తాజా రాజకీయాలు, దుబ్బాక ఎన్నికల ఫలితాలు, గ్రేటర్​ ఎన్నికలపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • గాంధీలో నాన్​ కొవిడ్ సేవలు..

ఈ నెల 21 లోపు గాంధీ ఆస్పత్రిలో నాన్ కోవిడ్ వైద్య సేవల పునః ప్రారంభంపై డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కొవిడేతర వైద్యసేవలపై వైద్యవిద్య సంచాలకుల మార్గదర్శకాలు జారీ అయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • రైతులపై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది..

సన్నరకం ధాన్యం సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రైతులపై ఒత్తిడి చేసిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి వ్యాఖ్యానించారు. రకాలతో సంబంధం లేకుండా నాణ్యత ఆధారంగా ఎఫ్‌సీఐ ధాన్యం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. సన్నరకం సాగుచేయాలని ప్రోత్సహించిన రాష్ట్రమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఆదుకోకుంటే ఆత్మహత్యలే..

టపాసుల విక్రయం, కాల్చడంపై హైకోర్టు నిషేధ ఉత్తర్వులు ఇవ్వటంపై బాణాసంచా వ్యాపారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిషేధాన్ని వ్యతిరేకిస్తూ... ఆందోళనకు దిగారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • పలు చోట్ల తేలికపాటి వర్షం..

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ద్రోణి వల్ల పలు చోట్ల తేలికపాటి వర్షం కురిసిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్లుండి నుంచి చలి తీవ్రత క్రమంగా పెరగనున్నట్టు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • భారీ డ్యాంల నిర్మాణం లేనట్టే..

దేశంలో భూగర్భ జలాలను పెంచాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్​ షెకావత్​. భవిష్యత్తు తరాల మనుగడకు, ప్రస్తుత నీటి భద్రతకు భూగర్భ జలాలు చాలా ముఖ్యమన్నారు. అయితే.. దేశంలో పెద్ద పెద్ద జలాశయాలు నిర్మించేందుకు అనువైన ప్రదేశాలు లేవని పేర్కొన్నారు మంత్రి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • అశ్లీల ప్రకటనలపై నిషేధం..

అశ్లీల ప్రకటనలపై మధ్యంతర నిషేధం విధించింది మద్రాస్​ హైకోర్టు. ఇలాంటి ప్రకటనలతో యువత పెడదారిన పడతారంటూ దాఖలైన పిటిషన్​ను విచారించిన మధురై ధర్మాసనం.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • పబ్​జీ రీఎంట్రీ..

భారత మార్కెట్​లోకి పబ్​జీ రీఎంట్రీ ఇవ్వనుంది. కొత్త గేమ్​ను త్వరలోనే ఆవిష్కరించనున్నట్టు ప్రకటించింది పబ్​జీ కార్పొరేషన్​. ఈ నేపథ్యంలో దేశంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది పబ్​జీ మాతృ సంస్థ క్రాఫ్టాన్​ ఐఎన్​సీ. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • అది మాకు దక్కిన గౌరవం..

టీ20 ప్రపంచకప్​ను భారత్​లో నిర్వహించడం తమకెంతో గర్వకారణమని బీసీసీఐ అధ్యక్షుడు​ గంగూలీ అన్నాడు. టోర్నీ నిర్వహణ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • వాళ్లిద్దరిలో ఒకర్ని పెళ్లి చేసుకోవాలనుకున్నా..

పెళ్లంటూ చేసుకుంటే హీరో వెంకటేశ్​ లేదా రాజీవ్​ గాంధీనే చేసుకుంటానని హీరోయిన్​ రాశి తన తల్లిదండ్రులకు చెప్పేవారట. ఈటీవీలో 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్న నటి రాశి.. ఈ విషయాన్నివెల్లడించారు. వీటితో పాటే పలు ఆసక్తికర సంగుతుల్ని పంచుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details