మేము వ్యతిరేకం...
ఆదివారం రాజ్యసభలో ప్రవేశపెట్టే వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తామని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు స్పష్టం చేశారు. రైతులకు తీవ్ర నష్టం కలిగించేలా.. కార్పొరేట్లకు మేలు చేసేలా కేంద్రం బిల్లులు తీసుకొచ్చిందని దిల్లీలో ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
అందులో తెలంగాణ భేష్...
రాష్ట్రంలో కొవిడ్ మరణాల రేటు జాతీయ సగటు కన్నా తక్కువగా ఉందని.. తెలంగాణ ప్రభుత్వం కరోనాను చాలావరకు అదుపు చేయగలిగిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. 12 రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ, కేంద్రమంత్రి పీయూష్ గోయల్ దృశ్యమాధ్యమం ద్వారా సమావేశమయ్యారు. రాష్ట్రాల్లో కొవిడ్ నియంత్రణ చర్యలపై సమీక్ష జరిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మూడు రోజులు వర్షాలంటా...
రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురుస్తాయని వాతావరణ కేంద్రం సంచాలకులు ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
సాగర్ సోయగం....
ఎగువన కురుస్తున్న వర్షాలతో నాగార్జునసాగర్‌కు వరద నీరు భారీగా చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 4,49,433 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడం వల్ల నాగార్జునసాగర్ జలాశయం 20 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
సెల్ఫీ దిగేందుకు వెళ్లి...
ఏళ్ల తర్వాత వాగు నిండుగా ప్రవహించడాన్ని చూసేందుకు జనాలు గుంపులుగా తరలివచ్చారు. కొందరు యువకులు ఉత్సాహంతో అందులో ఈత కొడుతూ సెల్పీలు దిగారు. ఓ యువకుడు సైతం సెల్ఫీ దిగేందుకు యత్నించి వాగు ఉద్ధృతికి బలయ్యాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలోని లింగంపేట సమీపంలోని దుందుభి వాగులో చోటుచేసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.