తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్​ @7PM - top ten news @7pm

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​ టెన్ న్యూస్​ @7PM
టాప్​ టెన్ న్యూస్​ @7PM

By

Published : Jun 16, 2020, 7:00 PM IST

సరిహద్దు ఘర్షణ.. సూర్యాపేట వాసి మృతి

భారత్‌-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో మృతి చెందిన ముగ్గురు సైనికుల్లో సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ ఉన్నారు. ఆయన మృతిపై అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.కల్నల్​ సంతోష్​ గురించి పూర్తి వివరాలు.

లద్దాక్ ఘర్షణలో అమరుడైన తమిళనాడు వాసి

లద్దాక్​ వద్ద వాస్తవాధీన రేఖ వెంబడి భారత్​- చైనా సైనికుల మధ్య చెలరేగిన ఘర్షణలో తమిళనాడు రామనాథపురం జిల్లాకు చెందిన హవల్దార్​ పళని ప్రాణాలు కోల్పోయారు. ఆయన ఎప్పటి నుంచి సైన్యంలో ఉన్నారో తెలుసా?

గాల్వన్​ లోయకు ఆ పేరెలా?

భారత్​-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ అందిరి దృష్టి వాస్తవాధీన రేఖకు సమీపంలోని గాల్వన్​ లోయపైనే ఉంది. అసలింతకీ.. ఈ ప్రాంతానికి గాల్వన్​ అన్న పేరు ఎలా వచ్చింది? అసలు దీని చరిత్ర ఏంటి?

కలెక్టర్లతో ముగిసిన సీఎం కేసీఆర్ సమావేశం

కలెక్టర్లతో ముగిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం ముగిసింది. దేనిపై చర్చ సాగిందంటే!

ఐదురోజుల పాటు మోస్తరు వర్షాలు

రానున్న ఐదు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నైరుతి రుతుపవనాల ఆగమనంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించింది. ఏ ఏ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటే!

అమెరికాలో 25 అడుగుల అంజన్న​ విగ్రహం

అమెరికాలోని డెలవేర్​లో 25 అడుగుల హనుమాన్​ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. హిందూ టెంపుల్​ అసోసియేషన్​ ఆధ్వర్యంలో ఈ వేడుక ఘనంగా జరిగింది. పూర్తి విశేషాలు మీ కోసం.

ప్రతి ఐదుగురిలో ఒకరికి కరోనా

ప్రపంచంపై కరోనా తీవ్రత ఏ విధంగా ఉందో తెలియజేసే మరో విషయం బయటపడింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదుగురిలో ఒకరికి కరోనా సోకే అవకాశముందని బ్రిటన్​కు చెందిన ఓ నిపుణుల బృందం తేల్చింది. ఆ సంస్థ ఇంకా ఏం చెప్పింది?

ఎఫ్​డీఐల ఆకర్షణలో 9వ స్థానానికి భారత్​!

2019లో అత్యధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (51 బిలియన్ డాలర్లు) ఆకర్షించిన తొమ్మిదో దేశంగా భారత్​ నిలిచిందని ఐరాస వాణిజ్య సంస్థ యూఎన్​సీటీఏడీ నివేదిక పేర్కొంది. నివేదిక పూర్తి సారంశం.

పింక్​బాల్​ టెస్టు పెద్ద సవాల్​

ఆస్ట్రేలియాతో జరగనున్న పింక్​బాల్ టెస్టు పెద్ద సవాల్​ అని అభిప్రాయపడ్డాడు టీమ్​ఇండియా వైస్​కెప్టెన్ రోహిత్​ శర్మ. పిక్​బాల్​ టెస్ట్​ గురించి హిచ్ మ్యాన్​ను ప్రశ్నించింది ఎవరో తెలుసా?

సల్మాన్​ను ఆశ్రయించిన హీరోయిన్​!

ప్రముఖ సీనియర్​ నటి తనకు కరోనా సోకిందేమోనని అనుమానం వ్యక్తం చేసింది. వైరస్​ నిర్ధరణ పరీక్షలు చేయించుకోవడానికి డబ్బులు లేవని, తనని ఆదుకోవాలని బాలీవుడ్​ స్టార్​ సల్మాన్​ఖాన్​ను సాయం కోరింది. ఇంతకీ ఎవరు ఆమె?

ABOUT THE AUTHOR

...view details