నీటిపారుదలశాఖలో పోస్టులు
నీటిపారుదలశాఖకు 879 పోస్టులు మంజూరు చేస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నీటిపారుదలశాఖ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో కొత్త పోస్టుల భర్తీకి అనుమతినిచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
' మమ్మల్ని ఢీకొట్టే వాళ్లెవరూ లేరు'
తెలంగాణలో తెరాసను ఢీకొట్టే వాళ్లు లేరని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కొవాలంటే డైలాగ్‌లు కొడితే సరిపోదని ఆయన వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'వారితో సఖ్యతనే కోరుకుంటున్నాం'
కృష్ణా జలాల (Krishna Water) విషయంలో తెలంగాణతో కొనసాగుతున్న వివాదంపై.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ (Ap CM Jagan) సీరియస్గా స్పందించారు. సీమ, కోస్తా, తెలంగాణకు కృష్ణా జలాల్లో వాటా గతంలోనే ఉందని అన్నారు. ఏపీ అనంతపురం జిల్లా రాయదుర్గంలో నిర్వహించిన బహిరంగసభలో ఈ విషయమై మాట్లాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ప్రవేశాలకు గడువు పెంపు
ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు గడువు పెంచుతూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 వరకు ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కాంగ్రెస్ 'చలో రాజ్ భవన్'.!
రాష్ట్ర వ్యాప్తంగా పెట్రో ధరలపై నిరసనలు చేపట్టనున్నట్లు కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్‌మధు యాష్కీ గౌడ్ తెలిపారు. ఏఐసీసీ ఆదేశాల ప్రకారం ఆందోళనలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.