రాయలసీమపై పిటిషన్
తెలంగాణ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీలో ధిక్కరణ పిటిషన్ వేసింది. రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీని ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా ఏపీ పనులు చేస్తోందని ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
' జోక్యం చేసుకోవచ్చా'
కృష్ణా బేసిన్ (Krishna Basin)లో విద్యుదుత్పత్తి ఆపాలంటూ ఏపీ కృష్ణా జిల్లా రైతులు (Krishna District Farmers)వేసిన పిటిషన్పై హైకోర్టు (Highcourt) విచారణ చేపట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కర్ణాటకలో రేవంత్రెడ్డి..!
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కర్ణాటక కాంగ్రెస్ నేతలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 7న తన పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆ రాష్ట్ర మాజీ సీఎం సిద్ధరామయ్య, రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున్ ఖర్గే, మాజీ హోంమంత్రి ఎంబీ పాటిల్, కర్ణాటక పీసీసీ అధ్యక్షులు డీకే శివకుమార్లను ఆహ్వానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
బోనాలకు ఏర్పాట్లు
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను చాటిచెప్పే బోనాల పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆకాంక్షించారు. ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్న గోల్కొండ బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై జీహెచ్ఎంసీ, పోలీసు ఇతర శాఖల అధికారులతో మంత్రి తలసాని సమీక్షించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఆ నోటు కథ తెలుసా?
దేశంలో రూ. 0 నోట్లు 25లక్షలకు పైగా ఉన్నాయన్న విషయం మీకు తెలుసా? ఈ మాట విని ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమే! అయితే వీటికి ఆర్బీఐ గుర్తింపు లేదు కానీ వీటి ముద్రణ వెనక ఓ పెద్ద కథే ఉంది. 'అవినీతి' చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అదేంటో మీరూ చూసేయండి...