తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @ 5PM - Telugu top ten news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @ 5PM
టాప్​ టెన్​ న్యూస్​ @ 5PM

By

Published : Jul 4, 2021, 4:59 PM IST

'నన్ను ఎవరూ ఆపలేరు'

"చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధి, కార్యశుద్ధి ఉంటే ఏదైనా సాధ్యమే... ఎవరెన్ని మాట్లాడినా... కేసీఆర్​ ప్రయాణాన్ని ఆపలేరు. ఎన్నో ఏళ్లుగా కంటోన్న కల.. త్వరలోనే పరిపూర్ణం కాబోతోంది. లక్ష్యం ఏర్పాటు చేసుకుని ఆ లక్ష్యం దిశగా పోతున్నాం. ఎటు చూసినా కాకతీయ, కాళేశ్వరం నీళ్లతో కళకళలాడుతూ.. పచ్చదనంతో పరిఢవిల్లుతూ.. ధాన్యపు రాశులతో విలసిల్లుతోంది." అని సిరిసిల్ల పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్​ ప్రసంగించారు.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'అంతకు మించిన పనులేమున్నాయి'

కృష్ణా జలాలను కాపాడటం కంటే సీఎం కేసీఆర్​కు పెద్ద పనులు ఏమున్నాయని టీపీసీసీ రేవంత్​రెడ్డి నిలదీశారు. రాయలసీమ ఎత్తిపోతలకు జీవో 203 ఇచ్చినప్పుడు కేసీఆర్ మాట్లాడలేదని తెలిపారు. 34 శాతం కృష్ణా నీళ్లు చాలని మంత్రిగా హరీశ్‌ సంతకం పెట్టారని పేర్కొన్నారు.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఆ గుర్తింపు వస్తే..!

అద్భుత శిల్ప సంపదకు నెలవైన చారిత్రక రామప్ప ఆలయం ప్రపంచ వారసత్వ హోదా కోసం యునెస్కోకు నామినేట్‌ అయింది. చైనాలో ఈ నెల 16 నుంచి 31 వరకు జరిగే వరల్డ్‌ హెరిటేజ్‌ కమిటీ 44వ సమావేశంలో నిపుణులు.. రామప్ప వివరాలను పరిశీలించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'వారందరికి భారతరత్న..!'

దేశంలోని వైద్యులందరికీ ఈ ఏడాది భారతరత్న ప్రకటించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. కొవిడ్ వేళ తమ ప్రాణాలను లెక్కచేయకుండా వారు అందించిన సేవలకు ఇచ్చే గౌరవం ఇదేనని అన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

రెండేళ్ల పాప కాపాడింది

రైల్వే వంతెనపై స్పృహతప్పి పడిపోయిన తల్లిని, తమ్ముడిని కాపాడిందో చిన్నారి. తల్లి వద్దే కూర్చుని ఏడవకుండా.. పరిస్థితిని అర్థం చేసుకుని రైల్వే పోలీసులకు సమాచారం అందించింది. వారు ఆ ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

గోధుమ గింజల వరల్డ్​ రికార్డ్​

ఒక కిలోకు ఎన్ని గోధుమ గింజలు ఉంటాయో మీకు తెలుసా..? చెప్పటం అసాధ్యం కదా.. కానీ కర్ణాటకకు చెందిన అభిషేక్​ మాత్రం 87 గంటల్లో ఒక కిలో గోధుమ గింజలను లెక్కించి ఇండియాస్ వరల్డ్ రికార్డ్స్​లో చోటు సాధించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఆసక్తి తగ్గుతోందా..!

మనిషికి లైంగిక ఆరోగ్యం ఎంతో కీలకం. అందులో సమస్యలు వస్తే జీవితంలోని ఇతర విషయాలపైనా కచ్చితంగా ప్రభావం పడుతుంది. ఇటీవలి కాలంలో అనేకమంది పురుషుల్లో లైంగిక వాంఛ తగ్గిపోతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

గాల్లో బర్త్​డే..!

అమెరికాలోని కాలిఫోర్నియాలో తండ్రికి మరవలేని పుట్టినరోజు కానుకను అందించారు అనిరుద్ధ పావడే అనే వ్యక్తి. ఆయన 75వ జన్మదినం సందర్భంగా 13వేల అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్​కు తీసుకెళ్లారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

పూర్తి జాబితా రేపే.!​

ఒలింపిక్స్​ కోసం భారత అథ్లెట్ల తొలి బృందం.. జులై 17న టోక్యోకు బయలుదేరనుంది. ఈ మెగాక్రీడల్లో పాల్గొనే అథ్లెట్స్​ పూర్తి వివరాల జాబితాను జులై 5న(సోమవారం) ప్రకటిస్తామని ఐఓఏ అధ్యక్షుడు నరీందర్ బాత్రా తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

వాళ్లను దేవుళ్లలా చూస్తా

నటన అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు దర్శకుడు అనిల్ రావిపూడి. అందుకే నటీనటులను దైవంగా చూస్తానని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details