- ఆదుకుంటాం..
ప్రైవేటు ఉపాధ్యాయులు, సిబ్బందికి ఏప్రిల్ నుంచి రూ.2వేల ఆర్థిక సాయంతో పాటు బియ్యం అందించనున్నట్లు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్ వెల్లడించారు. ప్రైవేటు పాఠశాలల్లో సుమారు లక్షా 45 వేల మంది పనిచేస్తున్నారని తెలిపారు. ఇందుకోసం కార్యాచరణ సిద్ధం చేయాలని కలెక్టర్లు, అధికారులను మంత్రులు ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రాష్ట్రానికి మరో టెక్స్‌టైల్ కంపెనీ..
రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు మరో ప్రముఖ టెక్స్‌టైల్ కంపెనీ ముందుకొచ్చింది. రెడిమేడ్ వస్త్రాల తయారీలో ప్రముఖ పరిశ్రమగా పేరుగాంచిన గోకల్ దాస్ కంపెనీ తెలంగాణలో తమ కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రగతిభవన్‌లో టెక్స్‌టైల్ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- టీకా పక్కా..
రాష్ట్రంలో రెండో దశలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీలోని పారిశుద్ధ్య కార్మికుల నుంచి కమిషనర్ వరకు ప్రతిఒక్కరికి వ్యాక్సిన్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ సూచించారు. వ్యాక్సినేషన్ నిర్వహణపై జోనల్ కమిషనర్లతో.. కమిషనర్ వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తెరాస అసత్య ప్రచారం చేస్తోంది..
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో జిల్లాలోని పలు గ్రామాల్లో నిర్వహించిన ప్రచారంలో భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొన్నారు. తెరాస ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. దుబ్బాక, హైదరాబాద్ ఎన్నికల ఫలితాలతో సీఎం కేసీఆర్‌కు భాజపా అంటే భయం పట్టుకుందని అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- షర్మిలకు ఘనస్వాగతం..
ఖమ్మంలో సంకల్ప సభకు వెళ్తున్న వైఎస్ షర్మిలకు సూర్యాపేట జిల్లాలో ఘనస్వాగతం లభించింది. స్థానిక కొత్త బస్టాండు సమీపంలో వాహనం దిగి అభిమానులకు ఆమె అభివాదం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఎయిమ్స్‌లో 35 మంది వైద్యులకు కరోనా..