పార్లమెంట్‌కు కరోనా ఎఫెక్ట్...
పార్లమెంట్ వర్షాకాల సామావేశాలు గడువు కంటే ఒక వారం ముందే ముగిసే అవకాశముంది. పులు కేంద్ర మంత్రులు, సిబ్బందికి కరోనా సోకడం వల్ల కేంద్రం ఈ విధంగా ఆలోచిస్తున్నట్టు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
నగరం మళ్లీ... జలమయం...
ఉపరితల ఆవర్తన ప్రభావంతో హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. ఎటు చూసినా నీరే కనిపించేంతగా వాన కొట్టింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఇంకా ఏం చేద్దాం...
రాష్ట్రంలోని అన్ని జిల్లాల గిరిజన సంక్షేమ అధికారులు, ఐటీడీఏల పీఓలతో హైదరాబాద్ మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో మంత్రి సత్యవతి రాఠోడ్ సమావేశమయ్యారు. గిరిజనుల అభ్యున్నతి కోసం ఇంకా ఏం చేస్తే బాగుంటుందన్న విషయమై అందరూ దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
అధికారులపై 'నాలా' కేసు...
మేడ్చల్ జిల్లా నేరెడ్‌మెట్‌లోని దీనదయాళ్ నగర్లో నాలాలో పడి మృతి చెందిన చిన్నారి సుమేధ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు జీహెచ్ఎంసీ, ఇంజినీరింగ్ అధికారుల మీద కేసు నమోదు చేయనున్నట్టు నేరెడ్మెట్ సీఐ లక్ష్మీ నరసింహస్వామి తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
అక్రమ బాంబుల అడ్డా...
పశ్చిమ్ బంగా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు గవర్నర్ జగదీప్ ధన్ఖర్. రాష్ట్రంలో ఎన్ఐఏ ఉగ్రవాదులు పట్టుబడిన అనంతరం.. 'బంగాల్ అక్రమ బాంబుల తయారీకి అడ్డా'గా మారిందని ఆరోపించారు. దీదీ ప్రభుత్వ పాలనా వైఫల్యాలే దీనికి కారణమని విమర్శించారు. ఎన్ఐఏ ఇవాళ ఉదయం జరిపిన దాడుల్లో మొత్తం 9 మంది అల్‌ఖైదా ఉగ్రవాదులు పట్టుబడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.