తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​ 10 న్యూస్​ @ 5PM

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​ టెన్ న్యూస్​ @5PM
టాప్​ టెన్ న్యూస్​ @5PM

By

Published : Jun 16, 2020, 4:58 PM IST

సీఎంలతో మోదీ సమీక్ష

కొవిడ్-19 కట్డడికి తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్​లాక్​-1 గురించి ప్రధాని మోదీ ఏమన్నారంటే!

మోదీతో రాజ్​నాథ్ భేటీ..

భారత్​-చైనా ఉద్రిక్త పరిస్థితుల నడుమ ప్రధాని నరేంద్ర మోదీతో రక్షణమంత్రి రాజ్​నాథ్ సింగ్ భేటీ అయ్యారు. తక్షణం అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చలు జరిపారు. వ్యూహం ఏంటి?

ఉద్రిక్తతలపై కాంగ్రెస్ తీవ్ర​ ఆందోళన

భారత్​- చైనా మధ్య జరిగిన భౌతిక ఘర్షణలో ముగ్గురు భారత జవాన్ల మృతిపై కాంగ్రెస్ స్పందించింది. పరిస్థితిని గురించి రాజకీయ పార్టీలతో రక్షణ మంత్రిని చర్చించాలని డిమాండ్​ చేసింది. హస్తం పార్టీ ఇంకా ఏం కోరిందంటే!

ఎందుకీ ఉద్రిక్త పరిస్థితులు?

భారత-చైనా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రాణనష్టం సంభవించి.. భిన్నమైన ప్రతిష్టంభన నెలకొంది. ఇరుదేశాలు అనుసరిస్తోన్న వైఖరిపై సొసైటీ ఆఫ్ పాలిసీ స్టడీస్ డైరెక్టర్సి.ఉదయభాస్కర్ విశ్లేషణ చూద్దాం

చిన్నరైతులకు ప్రాధాన్యం

వారం, పదిరోజుల్లో రైతుల ఖాతాల్లో రైతుబంధు సాయం జమ చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆదేశాల మేరకు వ్యవసాయశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఉత్వర్వుల్లో పేర్కొన్న గివ్ ఇట్ అప్ విధానం గురించి తెలుసా?

రూ.2.24లక్షల కోట్లతో బడ్జెట్

సీఎం జగన్‌ నేతృత్వంలోని వైకాపా ప్రభుత్వం రెండోదఫా వార్షిక ఆర్థిక బడ్జెట్ (2020–21)ను ప్రవేశపెట్టింది. రూ.2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో పద్దును రూపొందించింది.బడ్జెట్​ పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

శానిటైజర్ల ప్రభావం ఏంటి?

కరోనా వైరస్​ వ్యాప్తిని అరికట్టేందుకు వ్యక్తిగత, పరిసరాలు శుభ్రత తప్పనిసరి. ఇందుకు పదేపదే శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవడం అలవాటుగా మారింది. కానీ ఈ శానిటైజర్లు ఎక్కువగా వాడటం వల్లఏం జరుగుతుందో తెలుసా?

12 రోజుల్లో రూ.16 వేల కోట్లు

అత్యవసర రుణ గ్యారెంటీ పథకం కింద చిన్న పరిశ్రమలకు రూ.16,031 కోట్లు రుణాలు ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. జూన్​ 1 నుంచి 12 వరకు ఈ రుణాలు అందించినట్లు వెల్లడించారు. ఇంకా ఏమన్నారంటే.

పాకిస్థాన్​ను మట్టికరిపించింది

గతేడాది ఇదే రోజున భారత్​- పాక్​ ప్రపంచకప్​లో భాగంగా ఇంగ్లాండ్ వేదికగా జరిగిన మ్యాచ్​లో బరిలో దిగాయి. ఈ పోరులో గెలిచి పాక్​పై వరల్డ్​కప్​ టోర్నీల్లో వరుసగా ఏడో విజయాన్ని నమోదు చేసింది ఇండియా. నాటి హైలెట్స్​.

సుశాంత్​ పరిస్థితి నాకూ ఎదురైంది

చిత్ర పరిశ్రమలో బంధుప్రీతి వల్ల తాను అనేక సమస్యలు ఎదుర్కొన్నట్లు తాజాగా వెల్లడించారు నటుడు ప్రకాశ్​రాజ్. వాటి నుంచి పాఠాలు నేర్చుకోగలిగితే కచ్చితంగా లేచి నిలబడగలమని ట్విట్టర్​లో తెలిపారు. ప్రకాశ్​రాజ్ ట్వీట్​ పూర్తి సారాంశం

ABOUT THE AUTHOR

...view details