తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @5pm - top news now

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

top ten news @5pm
టాప్​ టెన్​ న్యూస్​ @5pm

By

Published : May 12, 2020, 4:50 PM IST

  • వ్యవసాయశాఖపై సమీక్ష

వ్యవసాయశాఖపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని సమస్యలపై, వర్షాకాలంలో గోదాముల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • బతుకమ్మ చీరల ఉత్పత్తి షురూ

బతుకమ్మ చీరల ఉత్పత్తిని పునః ప్రారంభించడం తనకు ఎంతో సంతోషంగా ఉందంటూ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ ట్వీట్​ చేశారు. వారు రూపొందించిన చీరలను టెక్స్​టైల్ పార్కు, అపారెల్ పార్కు సమన్వయంతో స్థానిక ఎమ్మెల్యే పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • హైకోర్టు పచ్చజెండా

ఇంటర్ సమాధాన పత్రాల మూల్యాంకనానికి హైకోర్టు పచ్చజెండా ఊపింది. లాక్‌డౌన్‌లో ఇంటర్ మూల్యాంకనంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. అత్యవసరంగా విచారణ చేపట్టిన న్యాయస్థానం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ.. జవాబు పత్రాలు మూల్యాంకనం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఒక్క అడుగే!

రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్​ వినాయకుని విగ్రహం ఈ ఏడాది ఒక్క అడుగు ఎత్తులోనే ఏర్పాటు చేయనున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో గణనాథుడి ఎత్తు విషయంలో ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఊరుకునేది లేదు..

ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల చేపట్టడంపై రాష్ట్ర ఆర్థిక మంత్రి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా 805 అడుగుల నుంచి నీరు తరలించేందుకు ఆ రాష్ట్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ విషయమై కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • సొంత కారు లేదట!

తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే.. సోమవారం దాఖలు చేసిన నామినేషన్‌ పత్రాల్లో ఆస్తుల వివరాలు వెల్లడించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పత్రాల్లో తెలిపిన వివరాల ప్రకారం.. ఆయనకు ఇప్పటి వరకు ఎలాంటి సొంత కారు లేదు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • భారత్‌ది 8వ స్థానం

ప్రపంచంలో కొవిడ్-19 కేసుల సంఖ్యలో భారత్​ 13వ స్థానంలో ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య విషయానికి వస్తే 8వ స్థానంలో ఉంది. భారత్‌లో కరోనా లాక్‌డౌన్‌ సడలింపులు, వలస కార్మికుల తరలింపు తదితర చర్యల నేపథ్యంలో వైరస్‌ తీవ్రత పెరిగి యాక్టివ్‌ కేసుల సంఖ్య ఇంకా అధికం కానుందనే ఆందోళన మొదలైంది.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • రెడ్​మీ నోట్​ 9 ప్రో రిలీజ్

ప్రముఖ బడ్జెట్ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ రెడ్​మీ మరో కొత్త రెండు మోడళ్లను భారత మార్కెట్​లో ఇవాళ విడుదల చేసింది. ఎంఐ.కామ్, అమెజాన్​ వేదికగా ప్రత్యేక ఆఫర్లతో రెడ్​మీ నోట్​ 9ప్రో, నోట్​ 9ప్రో మ్యాక్స్​లను అందుబాటులోకి తెచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఏ మాత్రం తగ్గలేదు

బాక్సింగ్‌ లెజెండ్‌, మాజీ ప్రపంచ హెవీ వెయిట్ ఛాంపియన్ మైక్ టైసన్ తాజాగా మరో ట్రైనింగ్‌ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. తనలో ఇంకా బాక్సింగ్‌ చేసే సత్తా ఉందని అభిమానులకు చెప్పకనే చెప్పాడు. వీడియోను పోస్టు చేసిన మాజీ ఛాంపియన్‌‌ 'ఐయామ్‌ బ్యాక్‌' అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మనసు చలించిపోయింది

సినీ నటుడు సోనూ సూద్​ తన ఉదారతను మరోసారి చాటుకున్నాడు. లాక్​డౌన్​లో చిక్కుకున్న వలస కార్మికుల్ని వారి స్వస్థలాలకు తరలించడానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశాడు. దీనికి కావాల్సిన ప్రభుత్వ అనుమతులను మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి పొందాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details