ఎదురు కాల్పులు
ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలు-మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అంధారి ఐరన్‌ఓర్ ప్లాంట్‌పై మావోలు దాడి చేశారు. పరిశ్రమకు చెందిన 6 వాహనాలను తగులబెట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
సీఎంగా పుష్కర్ సింగ్ ధామీ
ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ నియమితులయ్యారు. దెహ్రాదూన్‌లో జరిగిన భాజపా శాసనసభాపక్ష సమావేశంలో ఆ పార్టీ నేతలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీలో కేంద్ర పరిశీలకులుగా కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
అంతకంటే ఎక్కువే ఇచ్చారు
తెరాస పనైపోయిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. కేసీఆర్ ఎంత చెప్పుకున్నా.. తెలంగాణ ఉద్యమం చేసినా, తెలంగాణ కోసం కొట్లాడినా, రాష్ట్రం కోసం చావు నోట్లో తలకాయ పెట్టిన అని ఎన్నిసార్లు చెప్పుకున్నా... కేసీఆర్ చేసిన శ్రమ కంటే, త్యాగం కంటే ప్రజలు చాలా ఎక్కువే ఇచ్చారని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'ఆయనెందుకు చేరారు.?'
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాతే ప్రజలంతా మాస్కు తీయాలని మాజీ ఎంపీ విజయశాంతి పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా విషయంలో సీఎం కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. జూబ్లీహిల్స్‌లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె సందర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మూడో రోజు పల్లె ప్రగతి
రాష్ట్రంలో పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలు మూడోరోజు ఉత్సాహంగా సాగతున్నాయి. మంత్రులు, ప్రజాప్రతిధులు విరివిగా మొక్కలు నాటుతున్నారు. పర్యావరణ పరిరక్షణను ప్రజలు బాధ్యతగా తీసుకుని ముందుకు సాగాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
విద్యుత్ కొరతపై ఆందోళన
విద్యుత్ కొరతను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు ఆప్ కార్యకర్తలు. పరిస్థితిని అదుపుచేసేందుకు కార్యకర్తలపై జలఫిరంగులు ప్రయోగించారు పోలీసులు.