సుప్రీం గ్రీన్ సిగ్నల్
జులై 5 నుంచి ఛార్టర్డ్ అకౌంటెన్సీ(సీఏ) పరీక్షలు నిర్వహించేందుకు ఐసీఏఐకి అనుమతించింది సుప్రీంకోర్టు. ఐసీఏఐ పరీక్షలకు సంబంధించిన మూడు పిటిషన్లపై సుప్రీం మంగళవారం విచారణ చేపట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'అలా అయితే హెల్మెట్ ధరించాల్సిందే'
వర్షాకాలం వేళ ద్విచక్రవాహనదారులు జాగ్రత్తగా డ్రైవింగ్ చేయలాని సీపీ అంజనీకుమార్ సూచించారు. వాహనంపై ఇద్దరుంటే ఇద్దరూ హెల్మెట్ ధరించాలని సూచించారు. త్వరలో నిర్వహించనున్న బోనాల వేడుకలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలు తమకు సహకరించాలని సీపీ కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
రాష్ట్రంలో వర్షసూచన
రాష్ట్రంలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఒకటి, రెండుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
హైదరాబాద్ 'ఇంద్రజాల్'
జమ్ము వాయుసేన స్థావరంపై డ్రోన్ల (Drone) దాడి, కలుచక్‌లోని సైనిక స్థావరం వద్ద డ్రోన్ల సంచారంతో భద్రతా దళాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. ముప్పు వచ్చి మన ముంగిట నిలిచిందన్న విషయం ఈ ఘటనలతో అర్థమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
సుప్రీంలో పిటిషన్
గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష, విచారణకు సిట్ ఏర్పాటుపై హైకోర్టు స్టేను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష, విచారణకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ.. వర్ల రామయ్య, ఆలపాటి రాజా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.