ఫలితాలకు మార్గదర్శకాలివే..!
తెలంగాణలో ఇంటర్ రెండో సంవత్సరం ఫలితాలకు (Inter second year results) సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం(TS government) మార్గదర్శకాలు(guidelines) ఖరారు చేసింది. ఆయా సబ్జెక్టుల్లో మొదటి ఏడాది మార్కులే రెండో ఏడాదికి కేటాయించనున్నట్లు ప్రకటించింది. ఇంటర్ రెండో సంవత్సరం ప్రాక్టికల్స్‌కు పూర్తి మార్కులు(marks) ఇవ్వనున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఈ నెల 26న భేటీ
కలెక్టర్లతో సీఎం సమావేశం తేదీని మార్చారు. ఈ నెల 26న కలెక్టర్లతో ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. జిల్లా పాలనాధికారులు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, డీపీవోలు, డీఆర్డీవోలతో భేటీ కానున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మూడు రోజులు వర్షాలు
తెలంగాణలో రాగల మూడు రోజులు వర్షాలు కురవనున్నాయి. గురువారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఆ జిల్లాల్లోని మండలాలివే!
హన్మకొండ, వరంగల్ జిల్లాల పేర్ల మార్పునకు సంబంధించి కసరత్తు వేగంగా జరుగుతోంది. పేర్లు మార్పుతోపాటు.. మండలాలను రెండు జిల్లాలకు సర్దుబాటు చేయడం వల్ల జిల్లాల భౌగోళిక స్వరూపం మారే అవకాశాలున్నాయి. జిల్లాల పేర్లు మార్పు చేస్తూ.. ఒకటి, రెండు రోజుల్లో ఆదేశాలు వెలవడనున్నాయి. ఇక నగర కార్పొరేషన్ రెండు జిల్లాల పరిధిలోకి రానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మూడోసారి భేటీ
ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో మూడు సార్లు భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మంగళవారం.. ప్రతిపక్ష నేతలతో సమావేశమైన వెంటనే కిశోర్‌తో చర్చలు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.