తెలంగాణ

telangana

By

Published : Jul 7, 2021, 2:56 PM IST

ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @ 3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @ 3PM
టాప్​ టెన్​ న్యూస్​ @ 3PM

బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి

టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. పార్టీ కార్యకర్తలు, నేతలు, నాయకుల ముందు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కిషన్‌రెడ్డికి పదోన్నతి..!

మంత్రివర్గ విస్తరణ దృష్ట్యా కేంద్రం పిలుపుతో కేంద్ర సహాయ మంత్రి కిషన్​ రెడ్డి (kishan reddy) ప్రధాని నివాసానికి చేరుకున్నారు. మంత్రివర్గంలో కిషన్‌రెడ్డికి పదోన్నతి కల్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

పాఠశాలలు పునఃప్రారంభం..!

ఏపీలో ఆగస్టు 16వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలని జగన్​ సర్కార్ నిర్ణయించింది. ఆగస్టులోపు విద్యాసంస్థల్లో నాడు-నేడు పెండింగ్ పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈనెలాఖరులోపు ఇంటర్ విద్యార్థులకు మార్కుల మెమోలు జారీ చేయనున్నట్లు స్పష్టం చేశారు.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

క్రీడా హబ్​గా హైదరాబాద్

క్రీడాకారులను ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ ముందు ఉంటుందని మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బ్యాడ్మింటన్ స్టేడియంలో ఒలింపిక్స్ క్రీడాకారులకు సన్మానం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కొత్తగా 43 మంది..!

కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు చేపట్టేందుకు సిద్ధమయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ. ఏకంగా 43 మందిని మంత్రిమండలిలో చేర్చుకోనున్నారు. వీరంతా ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు దిల్లీలో రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ముగ్గురు రాజీనామా

కేంద్ర మంత్రి సంతోశ్​ గంగవార్​ రాజీనామా చేశారు. కేంద్ర క్యాబినెట్​ నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించారు. ఆయనతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్​ పోఖ్రియాల్, ఎరువులు రసాయనాల శాఖ మంత్రి సదానంద గౌడన​ సైతం రాజీనామా చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ప్రపంచ దేశాలకు భారత్​ హెచ్చరిక

ఐరాస జనరల్​ అసెంబ్లీలో ఉగ్రవాద నిర్మూలనపై జరిగిన చర్చల్లో భాగంగా భారత్​ ప్రపంచ దేశాలను హెచ్చరించింది. ఐక్య పోరాటానికి భంగం కలిగించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

బంధానికి 'హక్కుల' చిక్కులు!

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికా మధ్య సంబంధాలు మరింత బలహీనమయ్యే సూచనలు కన్పిస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. గిరిజన హక్కుల ఉద్యమకారుడు స్టాన్​ స్వామి మృతిపై అంతర్జాతీయంగా విమర్శలు రావడం మంచిది కాదని చెబుతున్నారు

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'వందేళ్లయినా మీ వల్ల కాదు!'

అఫ్గాన్​ ప్రభుత్వం మరో వందేళ్లైనా తాలిబన్​ చెరలోకి వెళ్లబోదని ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్​ ఘనీ అన్నారు. దేశంలో జరుగుతున్న రక్తపాతం, విధ్వంసానికి తాలిబన్​, వారి మద్దతుదారులే కారణమని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఆ రేసులో షెఫాలీ, ​ రాణా

జూన్ నెలకు ఐసీసీ ప్లేయర్​ ఆఫ్ ది మంత్ రేసులో నిలిచారు భారత మహిళా క్రికెటర్లు షెఫాలీ వర్మ, స్నేహ్​ రాణా. వీరితో పాటు ఇంగ్లాండ్ క్రికెటర్ ఎకిల్​స్టోన్​ కూడా నామినేట్ అయింది. పురుషుల విభాగంలో కివీస్​ ప్లేయర్లు కాన్వే, జేమీసన్​, దక్షిణాఫ్రికా ఆటగాడు డికాక్ రేసులో ఉన్నారు.​

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details