ముహూర్తం ఖరారు!
కొన్ని రోజులుగా సర్వత్రా చర్చనీయాంశమైన కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 8న కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగనుంది. ఇందులో 22 మంది వరకు కొత్తవారికి అవకాశం దక్కనున్నట్టు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
పోలీసులను ఎందుకు పెట్టారు?
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలను రెచ్చగొట్టేందుకే జలవివాదాన్ని తెరపైకి తీసుకువచ్చారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్, జగన్ మధ్య ఉన్న అవగాహన బయటపడుతుందనే.. 2020 ఆగస్టు5న కేంద్రం ఏర్పాటు చేసిన అపెక్స్ కౌన్సిల్‌కు కేసీఆర్ హాజరు కాలేదని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కొత్త గవర్నర్లు
దేశంలో పలు రాష్ట్రాల గవర్నర్లు బదిలీ అయ్యారు. మరికొందరు కొత్తగా నియమితులయ్యారు. భాజపా సీనియర్ నేత కంభంపాటి హరిబాబు(kambhampati haribabu).. మిజోరం గవర్నర్‌గా(mizoram governor) నియమితులయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
అలా చేయడం కరెక్ట్ కాదు
ప్రజాస్వామ్యంలో నిరసన అనేది ఒక ముఖ్యమైన భాగమని.. ప్రజలు, ప్రభుత్వం దృష్టిని ఆకర్షించేందుకు ఉపయోగపడుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. కానీ నిరసన పేరుతో ద్విచక్రవాహనాన్ని, సిలిండర్ల నీటిలో పడేయడమనేది హర్షించదగిన విషయం కాదంటూ అసహనం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఆయనది రోజుకో మాట
ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన మంత్రులు రోజుకో మాట మాట్లాడుతున్నారని.. కేవలం హుజూరాబాద్ ఉపఎన్నికల కోసం జలవివాదం తెరపైకి తీసుకొచ్చారని ఏపీకి చెందిన ఎంపీ టీజీ వెంకటేశ్ ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.