- కీలక భేటీ..
ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ప్రగతి భవన్‌లో జరిగే ఈ సమావేశానికి మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులు హాజరు కానున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పరిశీలిస్తున్నాం.. విరమించండి..
కరోనా కష్టకాలంలో జూడాలు చేపట్టిన సమ్మె సరైంది కాదని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగడాన్ని ఆయన తప్పుబట్టారు. సమ్మెను వెంటనే విరమించాలని లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పోరాటం పునరావృతం అవుద్ది..
'మానుకోట తిరుగుబాటుకు పదకొండు ఏళ్లు' పేరుతో సామాజిక మాధ్యమం వేదికగా తెజస చర్చాగోష్ఠి నిర్వహించింది. ఈ చర్చలో తెజస అధ్యక్షుడు కోదండరాం, మాజీమంత్రి ఈటల రాజేందర్, అద్ధంకి దయాకర్‌తో పాటు పలువురు జేఏసీ నేతలు పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రభుత్వ యంత్రాంగం స్పందించాలి..
ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి ప్రజల ప్రాణాలను కాపాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బంది డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని మాజీ మంత్రి ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రహస్య తయారీ..!
ఏపీలోని కృష్ణపట్నం ఆనందయ్య మందు కోసం వేలాది మంది ఎదురుచూస్తున్నారు. పరిశోధనలు జరిగేవరకు ఆపాలన్న ఆదేశాలతో ఔషధ పంపిణీ నిలిచిపోయింది. అయితే.. ఆనందయ్యతో పాటు.. ఆయన శిష్యులు రహస్యంగా ఔషధాన్ని తయారు చేస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'యాస్' ఉగ్రరూపం..