- హైవే కిల్లర్ కేసులో 12 మందికి ఉరిశిక్ష..
హైవే కిల్లర్ మున్నా కేసులో 12 మందికి ఉరిశిక్ష విధిస్తూ ఒంగోలు జిల్లా 8వ అదనపు సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది. ప్రధాన ముద్దాయి మున్నాతో పాటు మరో 11 మందికి ఉరిశిక్ష ఖరారు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డిపై కేసు నమోదు..
భూవివాదంలో ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డిపై కేసు నమోదైంది. కోర్టు ఆదేశాలతో జవహర్‌నగర్ పీఎస్‌లో సుభాష్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పకడ్బందీగా లాక్‌డౌన్..
రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పదమూడో రోజు కఠినంగా అమలు చేస్తున్నారు. మొదట్లో చూసీచూడనట్లు ఉండగా.. జనాలు ఎక్కువగా రోడ్లపైకి వచ్చారు. మళ్లీ లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశం రాకుండా ప్రస్తుత లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల తర్వాత... పోలీసులు ఆంక్షలు పక్కాగా అమలయ్యేలా చూస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అందరూ తెరాస వైపే..
హుజురాబాద్ నేతలందరూ తెరాస వైపే ఉన్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. పార్టీ నేతలను బెదిరిస్తున్నారన్న మాజీమంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలో నియోజకవర్గ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రఘురామ విడుదల వాయిదా..
ఆంధ్రప్రదేశ్ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు విడుదల వాయిదా పడింది. సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో ఉన్న రఘురామ ఆరోగ్య పరిస్థితిని గుంటూరు జిల్లా కోర్టు మేజిస్ట్రేట్ అడిగి తెలుసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- యూపీలో తొలి ఎల్లో ఫంగస్ కేసు..