- హైకోర్టు తీవ్ర ఆగ్రహం..
కరోనాకు సంబంధించిన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ చేపట్టింది. కొవిడ్ పరీక్షల విషయంలో ప్రభుత్వ తీరుపై ఉన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భాజపా వరాలు..
భాజపా తన గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. గ్రేటర్ ప్రజలపై హామీల వర్షం కురిపించింది. సామాన్యుడి సొంతింటి కలను నెరవేరుస్తామని.. 24 గంటలు ఉచితంగా మంచినీరు సరఫరా, జీహెచ్ఎంసీలో 28 వేల కొత్త నియామకాలు, మూసీ పునరుజ్జీవం కోసం మూసీ ఫ్రంట్ డెవెలప్‌మెంట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. మేనిఫెస్టోను మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సత్తా ఉందా అని అడిగారు..
తెలంగాణ రాకముందు సొంత రాష్ట్రం నడుపుకునే సత్తా ఉందా అని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారని రాష్ట్ర ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్ అన్నారు. ఆరేళ్లలోనే 400 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన భాగ్యనగరాన్ని భారతదేశంలోనే అరుదైన నగరంగా తీర్చిదిద్దామని తెలిపారు. హైదరాబాద్ నిజాం క్లబ్లో జరిగిన 'విశ్వనగరంగా హైదరాబాద్' సదస్సులో కేటీఆర్ పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'భాజపా, ఎంఐఎంవి దొంగ నాటకాలు..'
ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ భాజపా, ఎంఐఎం దొంగ నాటకాలు ఆడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. గ్రేటర్ ఎన్నికల్లో భాజపాకు మేలు చేసేందుకే ఓవైసీ సోదరులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. జీహెచ్ఎంసీలో కాంగ్రెస్‌ను గెలిపించాలంటూ బంజారాహిల్స్ డివిజన్ అభ్యర్థి తరపున ప్రచారంలో పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పరాయి పార్టీ నేతలపై ప్రేమ..
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దర్శకత్వంలో భాజపా, ఎంఐఎం నడుచుకుంటున్నాయని ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. పీవీ, ఎన్టీఆర్ లాంటి మహానేతల పేర్లను భాజపా-ఎంఐఎంలు తుచ్ఛ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బాష్పవాయువు ప్రయోగం..