- దీటుగా బదులిస్తాం..
రాజస్థాన్ జైసల్మేర్‌లో జవాన్లతో కలిసి దీపావళి వేడుకలు చేసుకున్నారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. పాక్, చైనాకు పరోక్ష హెచ్చరికలు పంపారు. సరిహద్దుల్లో భారత్ సహనాన్ని పరీక్షిస్తే దీటైన జవాబు తప్పదని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దీపావళి కానుక..
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ముంగిట నగరవాసులపై రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్తిపన్ను 50శాతం రాయితీ ప్రకటించింది. ఇప్పటికే చెల్లించిన వారికి వచ్చే ఏడాది తక్కువ వసూలు చేస్తామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. దీపావళి కానుకగా జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు రూ.14,500 నుంచి రూ.17,500 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వరద సాయం అర్హులందరికీ అందుతుందని మంత్రి భరోసా ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భాజపా కుట్ర..
హైదరాబాద్ గాంధీభవన్‌లో జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, వి.హన్మంతరావు తదితరులు పాల్గొని నెహ్రూ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం... రాష్ట్ర ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పుష్కరఘాట్ల పరిశీలన..
ఈనెల 20 నుంచి జరగబోయే తుంగభద్ర నది పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే అబ్రహం పుష్కరఘాట్లను పరిశీలించారు. భక్తుల సౌకర్యార్థం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దటీజ్ ప్రసాద్..
రోజువారీ జీవితంలో వ్యాయామాన్ని ఒక భాగం చేస్తే శారీరక దృఢత్వంతో పాటు.. మానసిక ఉల్లాసం మన దరిచేరుతుంది. ఉరుకుల పరుగుల ఈ నగర జీవనంలో రోజులో కొద్దిపాటి వ్యాయామం మనల్ని చురుకైన వ్యక్తులుగా తయారు చేస్తుంది. ఇలా రోజూ చేసే వ్యాయామంలోనూ వ్యక్తిగత రికార్డులు కొల్లగట్టవచ్చని నిరూపిస్తున్నారు.. హైదరాబాద్‌కు చెందిన ప్రసాద్ వడ్డేపల్లి. ఫిట్ నెస్ కోసం సైక్లింగ్ ఎంచుకొని.. 77 వేల కిలోమీటర్లు రైడ్ చేసి దేశంలోనే ఈ ఘనత సాధించిన వ్యక్తిగా అరుదైన రికార్డు సాధించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఈ-టికెట్’ తప్పనిసరి..