తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @1PM - Top ten news in telangana

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​టెన్​ న్యూస్​ @1PM
టాప్​టెన్​ న్యూస్​ @1PM

By

Published : May 22, 2021, 12:58 PM IST

  • ఆంక్షలు కఠినతరం..

రాష్ట్రంలో లాక్​డౌన్​ను పటిష్ఠంగా అమలు చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉదయం 10 గంటలు దాటిన తర్వాత రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్ చేస్తున్నారు. పాస్ హోల్డర్లు తప్ప ఎవరు బయటకు వచ్చినా వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్​లో లాక్​డౌన్​ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ప్రజలు సహకరించాలి..

రాష్ట్రంలో లాక్​డౌన్ నిబంధనలు కఠినంగా అమలవుతున్నాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి అన్నారు. ప్రజలంతా లాక్​డౌన్​కు సహకరించాలని కోరారు. తెలంగాణలో టీకాల కొరత ఉన్నందున.. భాజపా నేతలు కేంద్రంతో మాట్లాడి వ్యాక్సిన్లు అందుబాటులోకి తెచ్చేలా చూడాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అప్రమత్తతతో అడ్డుకట్ట..

బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని ప్రముఖ దంత వైద్యుడు డాక్టర్ ప్రతాప్ కుమార్ సూచించారు. ప్రాథమిక దశలోనే చికిత్స పొందితే ప్రాణాపాయం తప్పుతుందని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కన్నీటి గాథలు..!

కరోనా మహమ్మారి.. పచ్చని కుటుంబాలను ముక్కలు చేస్తోంది. ముచ్చటైనా బంధాలను ఛిద్రం చేస్తోంది. ఇవాళ ఇంట్లో ఉన్నా.. చూస్తుండగానే రేపు మట్టిలోకి చేరుతున్నారు. కళ్ల ముందే ఒక్కొక్కరుగా మాయమవుతున్నా.. నిస్సహాయులుగా కన్నీళ్లు కార్చటం తప్పిస్తే.. మరేమీ చేయలేని దైన్యం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • సోమవారం విడుదలయ్యే అవకాశం..

నరసాపురం ఎంపీ రఘురామ.. బెయిల్​పై సోమవారం విడుదలయ్యే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిల్ ఆదేశాలు రఘురామ న్యాయవాదులకు ఇంకా చేరనందున.. ప్రక్రియ ఆలస్యమవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 80% పల్లెలు వైద్యానికి దూరం..

దేశానికి పల్లెటూళ్లే పట్టుకొమ్మలని ప్రభుత్వాలు గొంతెత్తి చెబుతున్నా.. వాస్తవరూపం దాల్చడం లేదు. మిషన్​ అంత్యోదయ చేపట్టిన ఈ సర్వే ద్వారా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 80 శాతానికిపైగా పల్లెల్లో సరైన వైద్య సౌకర్యాలు లేవని సర్వేలో వెల్లడైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మహారాష్ట్రలో కరోనా మూడో దశ..

దేశవ్యాప్తంగా కొవిడ్ రెండో దశ విజృంభణ కొనసాగుతుంటే.. మహారాష్ట్రలో వైరస్​ వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. అయితే రాష్ట్రంలో మూడో దశ కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని మహారాష్ట్ర కొవిడ్​ కార్యదళ నిర్వాహక కమిటీ సభ్యుడు డాక్టర్ సంజయ్ ఓక్ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆక్సిజన్ అందక కరోనా రోగులు మృతి..

రాజస్థాన్​లోని అజ్​మేర్​లో ఆక్సిజన్​ అందక ఇద్దరు కరోనా రోగులు మృతి చెందారు. ఆక్సిజన్​ ప్లాంట్​ నుంచి సరఫరా తగ్గినందువల్లే ఈ సమస్య తలెత్తిందని ఆస్పత్రి సిబ్బంది వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కోహ్లీ చిన్ననాటి కోచ్​ మృతి..

విరాట్ కోహ్లీ కెరీర్ ప్రారంభంలో శిక్షణ ఇచ్చిన సురేశ్ బత్రా తుదిశ్వాస విడిచారు. ఈయన కోహ్లీ ప్రధాన కోచ్ రాజ్​కుమార్ శర్మకు అసిస్టెంట్​గా పనిచేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ప్రభాస్​ డైట్​ ఏంటంటే?

'ఆదిపురుష్​'లో ప్రభాస్​(రాముడు), తన(లక్ష్మణుడు) పాత్రల కోసం ఎలాంటి డైట్​ పాటిస్తున్నారో తెలిపాడు నటుడు సన్నీ సింగ్​. పాత్రలకు తగ్గట్లు శరీరాకృతిని మార్చుకునేందుకు ఎలాంటి స్టెరాయిడ్స్​ తీసుకోవట్లేదని చెప్పాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details