- ప్రజలు పాతేస్తారు..
హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవాన్ని ఎవరూ కొనలేరని ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సాగర్‌లో లాగా ఇక్కడ గెలవాలని చూస్తే ప్రజలు పాతేస్తారని తేల్చి చెప్పారు. ఎన్నికలు వస్తే ప్రజలంతా అండగా ఉంటారని స్పష్టం చేశారు. హుజూరాబాద్ ప్రజలు సహనం కోల్పోవద్దని సూచించారు. పద్ధతులు మార్చుకోకపోతే కరీంనగర్ కేంద్రంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆక్సిజన్ సిలిండర్లు చోరీ..
ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌లోని జిల్లా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో 200 ఆక్సిజన్ సిలిండర్లను చోరీ చేశారు దుండగులు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రజాప్రతినిధుల ఘర్షణ..
భూవివాదంతో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు రాళ్లతో పరస్పర దాడికి పాల్పడిన సంఘటన కరీంనగర్ జిల్లా చామనపల్లిలో చోటుచేసుకుంది. ఇంటి ముందు దారి విషయంలో వివాదం తలెత్తడమే ఈ గొడవకు కారణమని స్థానికులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆ కుర్రాడికి కొవిడ్ నెగెటివ్..
కరోనా బారిన పడి.. ఇంట్లో ఒకే గది ఉండటం వల్ల చెట్టునే ఐసోలేషన్ గదిగా మార్చుకున్న బి.టెక్ విద్యార్థి వైరస్ బారి నుంచి కోలుకున్నాడు. తాజాగా నిర్వహించిన పరీక్షలో కొవిడ్ నెగెటివ్ రావడం వల్ల అధికారులు ఆ యువకుణ్ని ఇంటికి తీసుకువెళ్లి.. అతని తల్లిదండ్రులకు అప్పజెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రైతులు నష్టపోతున్నారు..
ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించడం లేదని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం ఆరోపించారు. అకాల వర్షాలకు అన్నదాతలు నష్టపోతున్నా పట్టించుకోవట్లేదని విమర్శించారు. రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కాంగ్రెస్ సీనియర్ నేత మృతి..