తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @1PM - ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @1PM
TOP TEN NEWS @1PM

By

Published : Apr 11, 2021, 12:57 PM IST

  • పూలే విధానమే మాకు స్ఫూర్తి..

అణగారిన కులాల అభ్యున్నతికి, స్త్రీ జనోద్ధరణకు మహాత్మా జ్యోతిరావు పూలే విశేష సేవలు చేశారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఆయన ఆలోచన విధానంతోనే ప్రభుత్వం ముందుకు సాగుతుందని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కరోనా చలాన్​..

రాష్ట్రంలో కరోనా విజృంభణ దృష్ట్యా అధికారులు, పోలీసులు ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బయటికి వస్తున్న వారిపై కొరడా ఝుళిపిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వారికి జరిమానాలు విధిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఖాతాలో సొమ్ము కాజేస్తూ..

ఆన్​లైన్​ ట్రేడింగ్ యాప్​లో పెట్టుబడితో ఎక్కువ మొత్తం వస్తుందని నమ్మించి సొమ్ము కాజేసిన ముగ్గురుని రాచకొండ సైబర్​ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. 14 నకిలీ కంపెనీలు సృష్టించి.. సొమ్ము కాజేసిన వారిని అదుపులోకి తీసుకుని వారి బ్యాంకులలో ఉన్న 3.5 కోట్ల సీజ్ చేసినట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • శ్రీవారి సేవలో జస్టిస్‌ ఎన్వీ రమణ..

సుప్రీంకోర్టు తదుపరి సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. రంగనాయకుల మండపంలో జస్టిస్ ఎన్.వి.రమణ దంపతులకు పండితులు వేదాశీర్వచనం చేశారు. తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి... స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • లులూ గ్రూప్​ ఛైర్మన్​కు తప్పిన ప్రమాదం!

కేరళలో లులూ గ్రూప్​ హెడ్ యూసఫ్ అలీకి పెను ప్రమాదం తప్పింది. అలీ దంపతులు ప్రయాణిస్తున్న చాపర్ అత్యవసర ల్యాండింగ్ అయింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో మొత్తం ఏడుగురు ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఇళ్లలోంచి బయటకు రావొద్దు..

దిల్లీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న క్రమంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. కరోనాపై పోరాటానికి లాక్​డౌన్​ పరిష్కారం కాదని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'మోదీ కోడ్ ఆఫ్​ కండక్ట్​' గా మార్చండి..

బంగాల్ కూచ్​బిహార్​లో రాజకీయ నాయకులు 72 గంటలపాటు పర్యటించకుండా ఈసీ నిషేధించటంపై బంగాల్​ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని.. 'మోదీ ప్రవర్తనా నియమావళి'గా మార్చాలని ఎద్దేవా చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 2 క్వింటాళ్ల జిలేబీలు, 1000 సమోసాలు..

ఉత్తర్​ప్రదేశ్​ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు ఓ అభ్యర్థి సిద్ధం చేసిన రెండు క్వింటాళ్ల జిలేబీలు, వెయ్యికి పైగా సమోసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పది మందిని అరెస్టు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • గెలుపు సంతోషాన్నిచ్చింది..

చెన్నై సూపర్ కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లో విజయం సాధించింది దిల్లీ క్యాపిటల్స్. ఈ మ్యాచ్​ అనంతరం మాట్లాడిన దిల్లీ కెప్టెన్ పంత్.. ధోనీసేనపై విజయం సాధించడంపై సంతోషం వ్యక్తం చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • బాలయ్య-బోయపాటి మూవీ టైటిల్ ఎప్పుడంటే?

బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా టైటిల్​ను ప్రకటించేందుకు సిద్ధమైంది చిత్రబృందం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details