- రాష్ట్రానికి ఒరిగింది శూన్యం..
రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక పారిశ్రామిక రాయితీలు ఇస్తామని విభజన చట్టంలో చెప్పినా... పైసా కూడా ఇవ్వలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. పార్లమెంట్‌లో చేసిన చట్టాన్నేకేంద్రం తుంగలో తొక్కిందని విమర్శించారు. ఆత్మనిర్భర్ ప్యాకేజీ వల్ల రాష్ట్రానికి ఒరిగింది శూన్యమని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గోదావరి నీటి విడుదల..
కూడవెళ్లి వాగుకు మంత్రి హరీశ్‌రావు గోదావరి జలాలు విడుదల చేశారు. జలాలకు ప్రత్యేక పూజలు చేసి జలహారతి ఇచ్చారు. నీటి విడుదలతో 10 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రజా సమస్యలు వినరా..
హైదరాబాద్ గన్‌పార్కు వద్ద కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. సభలో మాట్లాడేందుకు సమయం ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. అసెంబ్లీ వరకూ ర్యాలీగా వెళ్లారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- లండన్ యువతి ట్రాప్‌లో రెవెన్యూ ఉద్యోగి..
సైబర్ నేరాలు పెరిగిపోతున్న క్రమంలో పోలీసులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. అయినా.. సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కుకుని అమాయకులు మోసపోతూనే ఉన్నారు. తాజాగా ఖమ్మం జిల్లాకు చెందిన రెవెన్యూ ఉద్యోగి పదిలక్షలు పోగొట్టుకున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గృహిణిని వేధిస్తున్న టీనేజీ ప్రేమ..
కాలేజీలో చదివే రోజుల్లో తీసుకున్న చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తుండగా.. వాటిని తొలగించాలని ఆయా సంస్థలకు ఓ గృహిణి లేఖ రాసింది. ఆ సంస్థలు స్పందించకపోవడంతో హైదరాబాద్‌లో ఉన్న ఆమె తల్లి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రుణమాఫీ అసాధ్యం..