తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్‌టెన్‌ న్యూస్‌ @1PM - టాప్‌టెన్‌ న్యూస్‌ @1PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @1PM
టాప్‌టెన్‌ న్యూస్‌ @1PM

By

Published : Nov 19, 2020, 12:58 PM IST

  • అదే మా పాలన మోడల్..

దేశంలో టెక్​ సొల్యూషన్స్​కు మంచి మార్కెట్​ ఉందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రపంచం కోసం టెక్​ సొల్యూషన్స్​కు భారత్​లో రూపకల్పన చేయాల్సిన సరైన సమయం ఇదేనని సూచించారు. టెక్నాలజీ ఫస్ట్​ అనేదే తమ పాలన మోడల్​గా పేర్కొన్నారు. బెంగళూరు టెక్​ సదస్సు-2020ని వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ప్రారంభించారు మోదీ. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఈసారి పొత్తుల్లేవు..

గ్రేటర్​ ఎన్నికల్లో ఎలాంటి పొత్తులుండబోవని మంత్రి కేటీఆర్​ స్పష్టం చేశారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని పేర్కొన్నారు. బల్దియాపై గులాబీ జెండా ఎగరేయటం ఖాయమని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కేసీఆర్‌ వల్లే సాధ్యమైంది..

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉన్న ఎన్నో అపోహలను తొలగిస్తూ... తెలంగాణను సీఎం కేసీఆర్​ నాయకత్వంలో అభివృద్ధి మార్గాన నడిపిస్తున్నామని మంత్రి కేటీఆర్​ తెలిపారు. మీట్​ ది ప్రెస్​ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి... ఆరున్నరేళ్లుగా రాష్ట్రం సాధించిన అభివృద్ధిని వివరించారు. హైదరాబాద్​ను సురక్షిత నగరంగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • భాజపా కార్యకర్తల ఆత్మహత్యాయత్నం..

పార్టీకోసం కష్టపడే వారికి కాకుండా... అక్రమార్కులకు టికెట్లు ఇస్తున్నారంటూ భాజపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. భాజపా కార్యాలయం ముందు కిరోసిన్​ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • చిన్నమ్మ కర్కషం..

దుస్తులు కొనిస్తానని చెప్పి... బాలికను నిర్బంధించి... చిన్నమ్మ చిత్రహింసలు పెట్టిన ఘటన మిర్యాలగూడలో చోటు చేసుకుంది. భూవివాదం కారణంగానే కిడ్నాప్ జరిగినట్లు బాలిక తల్లి ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • బావిలో పడిన గజరాజు..

తమిళనాడు ధర్మపురి జిల్లాలోని పాలకోడ్​ సమీపంలో 50 అడుగుల లోతైన బావిలో ఓ ఏనుగు పడిపోయింది. గజరాజు ఘీంకారాలు విని, దగ్గరకు వెళ్లి చూసిన ఓ గ్రామస్థుడు అటవీ అధికారులకు సమాచారం అందించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • చైనా ఉలిక్కిపడేలా..

ఉత్తర అరేబియా సముద్రంలో జరుగుతున్న రెండో విడత మలబార్‌-2020 నావిక దళ విన్యాసాలు అదరగొడుతున్నాయి. భారత్‌తోపాటు అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా నౌక దళాలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కంటతడి పెట్టిన జో బైడెన్..

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్​ భావోద్వేగానికి లోనయ్యారు. ఆరోగ్య సిబ్బందితో ఆన్​లైన్​ వేదికగా సమావేశమైన ఆయన కరోనా కష్టకాలంలో వారు ఎదుర్కొన్న అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో బైడెన్​ కన్నీరు పెట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మళ్లీ కామెంటరీ బాక్స్​లో సంజయ్!

ఆస్ట్రేలియా పర్యటన కోసం సంజయ్​ మంజ్రేకర్​ కామెంటేటర్​గా తిరిగి ఎంపికయ్యే అవకాశం ఉంది. ఏడాది ప్రారంభంలో అతడిని ప్యానెల్​ నుంచి బీసీసీఐ తప్పించింది. గతేడాది ప్రపంచకప్​లో జరిగిన వివాదమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • టన్నుల కొద్దీ ప్రేమలేఖలు రాశాను..

అమితాబ్​​ తన ప్రేమవివాహం గురించి, జయా బచ్చన్​కు రాసిన ప్రేమలేఖలు గురించి వెల్లడించారు. 'కౌన్​బనేగా కరోడ్​పతి' షోలో ఓ కంటెస్టెంట్​తో మాట్లాడూతూ ఈ విషయాల్ని పంచుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details