- బైడెన్ ఇమ్మిగ్రేషన్ సంస్కరణలు..
ఇమ్మిగ్రేషన్ విధానంలో సంస్కరణలకు నాంది పలకనున్నారు అమెరికా తదుపరి అధ్యక్షుడు జో బైడెన్. కీలకమైన వీసాల విషయంలో ట్రంప్ సర్కారు విధించిన ఆంక్షలను తొలగించనున్నారు. హెచ్1బీ వీసాల సంఖ్య పెంచడం సహా శాశ్వత నివాసదారులు తమ కుటుంబంతో కలిసి ఉండేలా నిబంధనలు సరళతరం చేయనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బైడెన్ 'కొవిడ్ టాస్క్‌ఫోర్స్'లో భారతీయ అమెరికన్..
అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్.. కరోనాను కట్టడి చేసి అమెరికాకు పూర్వ వైభవం తీసుకురావడమే తమ ప్రభుత్వ మొదటి లక్ష్యమన్నారు. ఇందుకోసం ఓ ప్రత్యేక కార్యదళాన్ని కూడా ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈ టాస్క్ ఫోర్స్‌లో భారతీయ అమెరికన్ డాక్టర్ వివేక్ మూర్తికి కీలక స్థానం కల్పించొచ్చని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఫిజీషియన్లే నిజమైన హీరోలు..
అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ కాన్ఫరెన్స్-2020 తమిళనాడు, టాపికాన్ వర్చువల్ సదస్సులో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. లక్షలమంది ప్రాణాలను కాపాడేందుకు ఫిజీషియన్లు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పనిచేస్తున్నారని గవర్నర్ పేర్కొన్నారు. వైద్యులు నిరంతరం తమ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవటం ద్వారా మెరుగైన సేవలు చేయగలుగుతారని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రేవంత్‌రెడ్డి ఇకనైనా తీరు మార్చుకోవాలి..
ప్రజల అవసరాలు గుర్తించి వారిని ఆదుకునే గొప్ప నాయకులు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. వారిని విమర్శించే హక్కు ఎంపీ రేవంత్‌రెడ్డికి లేదని వ్యాఖ్యానించారు. ఆదివారం.. నియోజకవర్గంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గుజరాత్ వ్యాపార సూత్రాలు తెలంగాణలో..
గుజరాత్ మార్క్‌ఫెడ్ విజయ రహస్యం తెలుసుకొని, దానిని రాష్ట్రంలో అమలు చేయడమే ముఖ్య ఉద్దేశమని తెలంగాణ మార్క్‌ఫెడ్ ఛైర్మన్ మార గంగారెడ్డి అన్నారు. దీని ద్వారా రైతులకు ఆసరాగా ఉండొచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు వ్యాపార విస్తరణలో భాగంగా ఆ సంస్థ ఛైర్మన్‌ని బృంద సభ్యులు కలిశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కానిస్టేబుల్‌పై దాడి..