తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​ టెన్​ ​న్యూస్ ​@1PM - TOP TEN NEWS @1PM

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​ టెన్​ ​న్యూస్ ​@1PM
టాప్​ టెన్​ ​న్యూస్ ​@1PM

By

Published : Aug 15, 2020, 1:00 PM IST

1.దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకం రెపరెపలు

దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ సహా రాష్ట్రాల ముఖ్యమంత్రులు జాతీయ జెండా ఆవిష్కరించారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ ఆయా పార్టీల కార్యాలయాల్లో మువ్వన్నెల జెండా ఎగురవేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2.'ఇంకా విషమంగానే ప్రణబ్​ ఆరోగ్య పరిస్థితి'

మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదని దిల్లీలోని ఆర్మీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఇప్పటికీ వెంటిలేటర్​పైనే చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3.ప్రగతిభవన్​లో ​త్రివర్ణ పతాక ఆవిష్కరణ

74వ స్వాతంత్య్ర వేడుకలు ప్రగతిభవన్​లో నిరాడంబరంగా జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్​ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. పంద్రాగస్టును పురస్కరించుకుని సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలోని ​సైనిక స్మారకం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళి అర్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4.సిరిసిల్లలో జాతీయ జెండాను ఆవిష్కరించిన కేటీఆర్​

పంద్రాగస్టును పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టర్​ కార్యాలయం వద్ద మంత్రి కేటీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5.'వ్యవసాయమే 'ఆత్మనిర్భర్​ భారత్​' తొలి ప్రాధాన్యం'

రైతులకు ఆధునిక మౌలిక సదుపాయాలను అందించడం కోసమే 'వ్యవసాయ మౌలికవసతుల నిధి'ని ఏర్పాటు చేసినట్టు ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. వ్యవసాయ రంగంలో స్వావలంబనతో పాటు రైతులు స్వయం సమృద్ధత సాధించడం 'ఆత్మ నిర్భర్​ భారత్​' ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6.పోలీస్ స్టేషన్​లో 16 నాగరాజులు మకాం

మహామహా నేరగాళ్లనే పట్టుకొచ్చి చెండాడే పోలీసుల కళ్లుగప్పి పోలీస్ స్టేషన్​లోనే మకాం వేశాయి 16 నాగరాజులు. తుపాకీలు, లాఠీలు పట్టుకు తిరగుతున్నా భయపడకుండా.. హిమాచల్ ప్రదేశ్ పోలీసులనే హడలెత్తించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7.భారత్​కు నేపాల్​ ప్రధాని కీలక సందేశం

భారత్​ 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో శుభాకాంక్షలు తెలిపారు. రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య స్నేహబంధం దృఢమైనదని ఉద్ఘాటించారు. నేపాల్ ప్రధాని కేపీ శర్మ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్​ కూడా అభినందనలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. 5 నెలలు ఫ్రీ డేటా

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వినియోగదారులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది రిలయన్స్ జియో. ఐదు నెలల ఉచిత డేటాతో పాటు జియో టు జియో ఫ్రీ కాల్స్ ప్లాన్ ప్రకటించింది. మరి ఈ ఆఫర్​ కోసం మీరు చేయాల్సిందల్లా ఏంటో తెలుసా?

9.భారత క్రికెటర్ల స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన భారత క్రీడాలోకం.. అందుకు కారణమైన సమరయోధులను గుర్తు చేసుకున్నారు. సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికులు క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10.'ఎంతోమంది త్యాగాల ఫలితం ఈ స్వాతంత్య్రం'

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా మిన్నంటుతున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్​కు చెందిన సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాలు చేసిన వారి ఆదర్శాలను మరోసారి గుర్తుచేసుకోవాలని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details