- కొత్తగా 41,506 కేసులు..
దేశంలో కొత్తగా 41,506 కరోనా కేసులు(Corona cases) నమోదయ్యాయి. వైరస్ ధాటికి మరో 895 మంది మృతిచెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- యాదాద్రి వైభవం..
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి పునర్నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. భక్తజన సందోహం ఆసక్తిగా ఎదురుచూస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధి త్వరలోనే పూర్తి కానుంది. సీఎం కేసీఆర్ దిశానిర్దేశంతో ఎప్పటికప్పుడు ఆలయ అభివృద్ధి తీరుపై యాడా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కామాంధుడు చిక్కాడు..
బతుకుదెరువు కోసం భార్యతో సహా భాగ్యనగరానికి వచ్చాడు. మేస్త్రిగా పనిచేస్తూ జీవనం వెల్లదీస్తున్నాడు. చెడు వ్యసనాల బారిన పడటం వల్ల భార్య విడిచిపెట్టి వెళ్లింది. అప్పటి నుంచి సైకోగా మారిపోయాడు. శారీరక వాంఛ తీర్చుకోవడానికి అభంశుభం తెలియని పసిపిల్లలపై అత్యాచారానికి పాల్పడటం మొదలుపెట్టాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కంటోన్మెంట్ జోన్‌గా కాళేశ్వరం.!
రాష్ట్రంలో కరోనా మహమ్మారి మళ్లీ కలవరపెడుతోంది. అక్కడకక్కడా కొన్ని ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. ఈ క్రమంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొలువై ఉన్న కాళేశ్వరంలో కొవిడ్ కలకలం రేపుతోంది. దీంతో కాళేశ్వరాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా భూపాలపల్లి కలెక్టర్ ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 35 శాతం కన్వీనర్ కోటా..
ఏపీలో ఉన్నత విద్యలో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు తెస్తోంది. ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో 35 శాతం సీట్లు కన్వీనర్ కోటా కింద భర్తీ చేసేలా చర్యలు చేపట్టింది. ఈమేరకు అసరమైన చట్టసవరణపై ఆర్డినెన్స్ తెచ్చేందుకు సిద్ధమైంది. ఇక సాధారణ పీజీ కోర్సులకూ ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహించనున్న ప్రభుత్వం.... ఇంజినీరింగ్ కళాశాలల్లో యాజమాన్య కోటా రుసుములను కన్వీనర్ కోటా కంటే మూడు రెట్లు పెంచనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కరోనా ఒత్తిడిని దూరం చేసే నృత్యం..