- మరో 45వేల కేసులు..
దేశంలో కొత్తగా 45,892 కరోనా కేసులు(Corona Cases) నమోదయ్యాయి. 817 మంది మృతిచెందారు. బుధవారం.. 18,93,800 మందికి పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్(ICMR) వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కొత్త మంత్రుల బాధ్యతల స్వీకరణ..
కొత్తగా నియమితులైన కేబినెట్ మంత్రులు గురువారం బాధ్యతలు స్వీకరించారు. రైల్వే శాఖ మంత్రిగా అశ్వినీ వైష్ణవ్, సమాచార, ప్రసారాల శాఖ మంత్రిగా అనురాగ్ ఠాగూర్ బాధ్యతలు చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఐదుగురు దుర్మరణం..
రాజస్థాన్ ఝాలవఢ్లో ఘోరం ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన నిద్రిస్తున్న ఓ కుటుంబంపైకి డంపర్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా.. మొత్తం ఐదుగురు మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కన్నప్రేమే యమపాశమై..
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో దారుణం చోటు చేసుకుంది. ముగ్గురు కుమార్తెలకు ఉరేసి... తల్లి బలవన్మరణానికి పాల్పడింది. చౌటుప్పల్ మండల కేంద్రానికి చెందిన తోరుపునూరి వెంకటేష్, రాణిలకు ముగ్గురు ఆడపిల్లలు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కొత్త చట్టం దిశగా చర్యలు..
ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలకు కొత్త చట్టం దిశగా యోచిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు(HIGH COURT) తెలిపింది. అలాగే కొవిడ్ మూడో(CORONA THIRD WAVE) దశను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నక్షత్ర వనం..