తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @ 11AM - Telugu top news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​ టెన్​ న్యూస్​ @ 11AM
టాప్​ టెన్​ న్యూస్​ @ 11AM

By

Published : Jun 28, 2021, 10:58 AM IST

Updated : Jun 28, 2021, 11:17 AM IST

  • పీవీ చేసిన సేవలు చిరస్మరణీయం..

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. దేశానికి పీవీ చేసిన సేవలు చిరస్మరణీయం అన్నారు. అసాధారణమైన ప్రతిభ, జ్ఞానం పీవీ సొంతం అని కొనియాడారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • దేశంలో కొత్త కరోనా కేసులు..

దేశంలో కొత్తగా 46,148 కరోనా కేసులు నమోదయ్యాయి. 58,578 మంది కోలుకోగా 979 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఒక్కరోజే 17,21,268 మందికి టీకా అందించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • డీలా పడ్డ కాంగ్రెస్​కు.. రేవంత్ దిక్సూచి..

టీపీసీసీ నూతన కార్యవర్గానికి పార్టీలో పలు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. నియోజకవర్గ, జిల్లా స్థాయిలో నాయకత్వ సమస్యతో సతమతమవుతున్న పార్టీని ప్రక్షాళన చేసే దిశలో నూతన కార్యవర్గం ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంది. నూతన పీసీసీ కార్యవర్గానికి హుజూరాబాద్‌ ఉప ఎన్నిక తొలి సవాల్గా​ నిలువనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • శ్రీశైలం జలాశయానికి భారీగా వరద

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. రిజర్వాయర్ గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 821.30 అడుగులుగా ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఉరేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లాలోని శివరాంపల్లిలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్​కు ఉరేసుకుని ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

ఉత్తర్​ప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొరాదాబాద్-లక్నో హైవేపై జీపును ఢీకొని బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరో 24మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • బ్రిటిష్‌ సైనిక రహస్యాలు బహిర్గతం!

బ్రిటన్​ ఆర్మీకి చెందిన సున్నిత సమాచారం కలిగిన రహస్య పత్రాలు ఓ బస్టాప్​ వద్ద కనిపించటం కలకలం రేపింది. క్రిమియా సముద్ర జలాల్లోంచి యుద్ధనౌకను పంపించే విషయాలు, దానిపై రష్యా స్పందిస్తే ఎదురుకొనే తీరు అందులో ఉన్నట్లు స్థానిక మీడియో వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • లాభాల్లో స్టాక్​ మార్కెట్​లు..

స్టాక్​ మార్కెట్​లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 119 పాయింట్లు పుంజుకుని 53,019 వద్ద కొనసాగుతుంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 25 పాయింట్లు బలపడి 15,881 వద్ద ట్రేడవుతుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • జట్టు పరిస్థితి దారుణం..

శ్రీలంక క్రికెట్ జట్టు ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేశాడు ఆ జట్టు మాజీ ఆటగాడు సనత్ జయసూర్య. వెంటనే బోర్డు తగిన చర్యలు తీసుకోవాలని సూచించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • గ్యాంగ్​రేప్​ కథతో సూర్య సినిమా!

సూర్య 40వ(Suriya) సినిమా ఓ గురించి ఓ వార్త చర్చనీయాంశమైంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓ గ్యాంగ్ రేప్​ కేస్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని సమాచారం. ఇందులో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

Last Updated : Jun 28, 2021, 11:17 AM IST

ABOUT THE AUTHOR

...view details