- మరో 2.76 లక్షల మందికి వైరస్..
దేశంలో కరోనా ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 2 లక్షల 76 వేల మందికి కొవిడ్ సోకింది. మరో 3,874 మంది మరణించారు. బుధవారం 20.55 లక్షల నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఇకపై ఇంటి వద్దే కరోనా పరీక్షలు!
కరోనా రెండో దశ పల్లెల్లో ఉద్ధృతంగా ఉన్న క్రమంలో ఇంటి వద్దే కరోనా పరీక్షలు నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. ఈ మేరకు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్).. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను బుధవారం రాత్రి విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పకడ్బందీగా లాక్డౌన్..
తెలంగాణలో లాక్డౌన్ ఆంక్షలు తొమ్మిదో రోజు పటిష్ఠంగా అమలవుతున్నాయి. ఉదయం వేళ నిత్యావసర సరకులు కొనుగోలు చేసేందుకు ప్రజలు బయటకు వచ్చారు. కొన్ని చోట్ల కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన వారిని పోలీసులు హెచ్చరించారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఓడిన రక్త బంధం..
కొవిడ్‌తో చనిపోయిన ఓ మహిళకు అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు కల్వకుర్తి పట్టణానికి చెందిన ముస్లిం యువకులు. రక్త సంబంధీకులు, కుటుంబ సభ్యులు వెనకడుగు వేసిన క్రమంలో.. కులమతాలకు అతీతంగా తామున్నామంటూ ముందుకు వచ్చారు. రక్తబంధం ముందు మానవత్వం గెలిచిందని నిరూపించారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కరోనా సోకిందా కంగారొద్దు..
కరోనా కాలమిది.. ఈ మహమ్మారి ఎప్పుడు ఎవరి ఇంట్లోకి తొంగి చూస్తుందో.. ఎప్పుడు ఎవరిని పలకరిస్తుందో ఊహించలేని పరిస్థితి..! పొరపాటునో గ్రహపాటునో కరోనా సోకగానే.. చాలా మందిలో మెుగట మెుదలయ్యేది ఆందోళన. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆ వైరస్ ప్రమాదకరం కాకపోవచ్చు..