- కరోనా మృత్యుకేళి..
దేశంలో సోమవారం 18.69 లక్షల నమూనాలను పరీక్షించగా.. 2.63 లక్షల కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. అయితే కరోనా మరణాలు మాత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 4,329గా నమోదైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రఘురామకు పరీక్షలు..
ఏపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి ఆయణ్ను పోలీసులు.. గుంటూరు జైలు నుంచి సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పది దాటగానే స్తబ్ధత..
తెలంగాణలో లాక్డౌన్ ఆంక్షలు ఏడో రోజు పటిష్ఠంగా అమలవుతున్నాయి. ఉదయం వేళ నిత్యావసర సరకులు కొనుగోలు చేసేందుకు ప్రజలు బయటకు వచ్చారు. కొన్ని చోట్ల కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన వారిని పోలీసులు హెచ్చరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కంటతడి పెట్టిస్తున్న కానిస్టేబుల్ వీడియో..
కరోనా కష్టకాలంలో తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఎంతో మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. మహమ్మారి బారిన పడతామనే భయాన్ని కూడా పట్టించుకోకుండా సేవలందిస్తున్నారు. లాక్డౌన్ నిబంధనలు పటిష్ఠంగా అమలయ్యేలా చర్యలు చేపడుతున్న పోలీసులు.. సమయం వచ్చినప్పుడల్లా తమలోని మానవత్వాన్ని చాటుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సోనూసూద్ ఆక్సిజన్ ప్లాంట్
అవసరం ఏదైనా.. ఎవరికైనా నేనున్నానంటూ స్పందిస్తున్న నటుడు సోనూసూద్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. మిత్రుడి విజ్ఞప్తి మేరకు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు సోనూసూద్ ముందుకొచ్చారు. ఈ విషయాన్ని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ధ్రువీకరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'తౌక్టే' బీభత్సం- నలుగురు మృతి..