భారత్‌లో కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలతో పాటు రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్ కూడా వచ్చే వారం అందుబాటులోకి వస్తోంది. ఈ మూడు టీకాల్లో ఏది ఎక్కు వ సమర్థవంతం? దుష్ప్రభావాలు ఎలా ఉంటాయి?పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కొత్త కేసులు 3.26 లక్షలు...
దేశంలో కొత్తగా మూడు లక్షల 26 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 3890మంది మరణించారు. శుక్రవారం 16.93 లక్షల నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మహారాష్ట్రలో బ్లాక్ ఫంగస్ కోరలుచాస్తోంది. ఇప్పటివరకు 2000 మందికి బ్లాక్ ఫంగస్ సోకినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కరోనా వైరస్‌కి సంబంధించిన అత్యవసర సాయాన్ని అభ్యర్థించే వారితో పాటు.. సేవలను అందించే వారిని అనుసంధానించే ట్విట్టర్ ఎస్ఓఎస్(అత్యవసర) పేజీని.. ఇకపై రాష్ట్రాల వారీగా అందుబాటులో ఉంచనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అన్నీ తానై అంత్యక్రియలు...
కరోనా మహమ్మారి కారణంగా బంధువులు చనిపోతే చివరి చూపునకు నోచుకోవడం లేదు. ఇతర కారణాలతో మృతి చెందినా అంత్యక్రియలు నిర్వహించడానికీ ఎవరూ ముందుకు రావడం లేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కరోనా కోరల్లో పాత్రికేయులు...
ఓ వైపు కొవిడ్ విజృంభణ, కొత్త కేసులు, మరణాలు, వ్యాక్సిన్లు. మరో వైపు... ప్రజల కష్టాలు, కన్నీళ్లు. వాటిపై పాలక పక్షాల నిర్ణయాలు. ఇలా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్న జర్నలిస్టులు పెద్దసంఖ్యలో వైరస్ బారిన పడుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కరోనా కష్ట కాలంలో ప్రభుత్వాలే అన్నీ చేయాలి అంటే కుదరదు.. బాధితులకు మనమూ సాయం అందించాలంటున్నారు రిలీఫ్ రైడ్ సభ్యులు. అన్నట్లుగానే.... వృద్ధులకు, వికలాంగుల కావాల్సిన అత్యవసర మందులు, ఆహారాన్ని సైకిళ్లపై వెళ్లి అందిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రక్తపాతానికి ఏళ్ల క్రితమే బీజం!...
పాలస్తీనా- ఇజ్రాయెల్ మధ్య కొన్నిరోజులుగా జరుగుతున్న భీకరపోరుకు కొన్నేళ్ల క్రితమే బీజం పడింది. ఈ రెండు దేశాల మధ్య 3చిన్నపాటి యుద్ధాలు కూడా జరిగాయి. 2014లో 50 రోజులపాటు జరిగిన పోరులో 2,220 మంది పాలస్తీనీయన్లు మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కోహ్లీని పట్టించుకునేవారే కాదు...
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్.. భారత సారథి కోహ్లీపై వివాదస్పద ట్వీట్ చేశాడు. కేన్ విలియమ్సన్ భారతీయుడైతే అతన్ని ప్రపంచంలోనే గొప్ప ఆటగాడిగా పరిగణించేవారని అభిప్రాయపడ్డాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'రామ్'డు ఇస్మార్ట్ బాలుడు!...
ఉత్సాహం అతని పేరు వింటే పరవళ్లు తొక్కుతుంది. ఎనర్జిటిక్ అనే పదానికి అతని పేరుని అర్థంగా వాడేసుకోవచ్చు. 'రామ్'డు మంచి బాలుడు అనే వాక్యాన్ని 'రామ్'డు హుషారైన బాలుడు అని కొత్తగా చెప్పుకోవచ్చు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.