తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్‌టెన్‌ న్యూస్‌ @11AM - TOP TEN NEWS @11AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @11AM
టాప్‌టెన్‌ న్యూస్‌ @11AM

By

Published : Nov 8, 2020, 10:59 AM IST

  • కొవిడ్​పైనే తొలి యుద్ధం..

అమెరికా అభివృద్ధి కోసం కలిసి పనిచేయడానికి సిద్ధమని బైడెన్ ప్రకటించారు. కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. అమెరికాలోని ప్రతి కుటుంబ ఆరోగ్య పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని ఆయన వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • నేనే గెలిచాను..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘోర పరాభావం చవిచూసినా.. ఇంకా ఓటమిని అంగీకరించడంలేదు డొనాల్డ్ ట్రంప్​. బైడెన్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని మరోమారు ఆరోపించారు. 7 కోట్లకుపైగా ఓట్లు సాధించిన తానే గెలిచినట్లు ట్వీట్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • రాజకీయ జీవితం ముగిసిపోతుందా..

రెండోసారి అగ్రరాజ్య పెద్దన్నగా వెలుగొందాలనే అధ్యక్షుడు ట్రంప్​ కలలు కల్లలయిపోయాయి. భారీ మెజారిటీతో గెలవాలనుకున్న ట్రంప్​ ఆశలకు గండిపడింది. ఈ నేపథ్యంలో ట్రంప్​ రాజకీయ జీవితం ఇక్కడితో ముగియనుందా? లేదా 2024లో జరగునున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారా? అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కొత్తగా 45,674 కరోనా కేసులు..

దేశంలో కొత్తగా 45,674 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 559 మంది వైరస్​కు బలయ్యారు. మొత్తం బాధితుల సంఖ్య 85,07,754కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1,26,121కి పెరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • అప్పుడు నాగరాజు.. ఇప్పుడు ధర్మారెడ్డి..

మేడ్చల్​ జిల్లా కీసర మాజీ తహసీల్దార్​ లంచం కేసులో మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. నకిలీ పాసుపుస్తకాల కేసులో అరెస్టైయిన ధర్మారెడ్డి బలవన్మరణానికి పాల్పడ్డారు. హైదరాబాద్​ కుషాయిగూడ వాసవీ శివనగర్ కాలనీలో ఉరేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • పత్తి రైతులకు షాక్..

తెలంగాణలో పత్తి రైతులకు సీసీఐ షాకిచ్చింది. నాణ్యంగా లేదంటూ ఈనెల 12 నుంచి మద్దతు ధరను రూ.50 తగ్గిస్తున్నట్లు భారత పత్తి సంస్థ (సీసీఐ) ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • అంతా ఖుల్లా.. అవుతాం గుల్ల..

హైదరాబాద్​లో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలన్నీ ఊపందుకున్నాయి. రెస్టారెంట్లు, హోటళ్లు, పబ్బులు, బార్‌లు, మాల్స్‌ అన్ని తెరుచుకున్నాయి. కొవిడ్‌ నిబంధనలతోపాటు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఇవన్నీ సాగించాలని ప్రభుత్వం పేర్కొన్నా.. చాలా చోట్ల ఆ నిబంధనలే కానరావడంలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • అంతా... అవినీతి రాజకీయ సంత..

అవినీతి అరికట్టేందుకు 1963లో కేంద్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేశారు. అయితే ఈ లక్ష్యాన్ని సీబీఐ చేరుకుందా? అన్న ప్రశ్నకు సీబీఐ పనిపోకడలు భ్రష్టు పట్టిపోయాయనే స్పష్టమవుతోంది. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారి రాజకీయ ప్రయోజనాన్ని సాధించి పెట్టగల పనిముట్టుగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • అలా అనడం సరికాదు..

ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి కోహ్లీని తప్పించాలనడం సరికాదని మాజీ క్రికెటర్ సెహ్వాగ్ అన్నాడు. అది సరైనా పరిష్కారం కాదని అభిప్రాయపడ్డాడు. జట్టు మెరుగుపడేలా మార్పులు చేయాలని ఫ్రాంచైజీకి సూచించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • సవాలు స్వీకరించిన రామ్​చరణ్..

గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో పాల్గొన్న హీరో రామ్​చరణ్.. మొక్కలు నాటి తన వంతు బాధ్యత నిర్వర్తించారు. తన అభిమానులు కూడా మొక్కలు నాటాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details