కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా గోదావరి నదిపై నిర్మించిన ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు వద్ద నిర్మించిన సరస్వతి పంపుహౌస్‌లో 8 మోటార్ల ద్వారా పార్వతి బ్యారేజ్‌లోకి నీటిని ఎత్తిపోస్తున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
అధికారం ఉన్నా, లేకున్నా, ఆపద సమయంలో ఆకలితో ఉన్న వారికి కడుపునిండా భోజనం పెట్టడంలో ఉన్న ఆనందం ముందు ఏదీ ఎక్కువ కాదు అంటున్నారు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సతీమణి కోనేరు రమాదేవి. పదకొండేళ్ల నుంచి ప్రతిరోజు వారింట్లో భోజనం వండి పేదల ఆకలి తీరుస్తున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
వ్యసనంగా మారుతున్న సరదా...
పట్నం, పల్లె అని తేడా లేకుండా అన్నిచోట్లా యువత ఆన్లైన్ జూదానికి బానిసవుతోంది. ఓవైపు లాక్డౌన్ మరోవైపు కళాశాలలు మూతపడటం వల్ల ఖాళీగా ఉన్న యువకులు.. పేకాటకు ఆకర్షితులై అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు. వాటిని చెల్లించలేక చివరకు ప్రాణాలొదులుతున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- మరో 54 వేల కరోనా కేసులు...
దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య (Corona virus) బుధవారంతో పోల్చితే స్వల్పంగా పెరిగింది. కొత్తగా 54,069 మంది వైరస్ బారిన పడ్డారు. కాగా, మహమ్మారి ధాటికి మరో 1,321 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ నుంచి 68,885 మంది కోలుకున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- కశ్మీరానికి ప్రజాస్వామ్య చికిత్స...
జమ్ముకశ్మీర్‌లో రాజకీయ ప్రక్రియ పునరుద్ధరణ అంశంపై ఆ ప్రాంత నేతలతో.. ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించనున్న చర్చలు సరికొత్త కశ్మీరానికి అంకురార్పణ కానున్నాయి. దశాబ్దాలుగా హింసతో నలిగిపోయిన సుందరమైన ఈ ప్రాంతానికి ప్రశాంతత చేకూరే నిర్ణయాలు... పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- మెదడుపైనా మాహమ్మారి ప్రభావం...
మహమ్మారితో బాధపడిన వారిలో మతిమరుపు, కుంగుబాటు వంటి లక్షణాలు కనిపించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీర్ఘకాలంగా కొవిడ్ సమస్యలతో బాధపడుతున్న వారిలో మెదడు వాపు ప్రక్రియ ప్రభావం తీవ్రంగా ఉందని తేల్చారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
భవిష్యత్తులో సంభవించే మహమ్మారుల నిర్మూలన కోసం 'యూనివర్సల్ కరోనావైరస్ వ్యాక్సిన్'ను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ టీకా కొవిడ్-19పైనే కాకుండా మరిన్ని కరోనా వైరస్‌లపై సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు ప్రయోగాల్లో తేలిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- లాభాల్లో స్టాక్ మార్కెట్లు...
స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమమ్యాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 171 పాయింట్ల లాభంతో 52,477 వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 38 పాయింట్లు పుంజుకుని.. 15,729 వద్ద కొనసాగుతోంది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
బ్యాట్స్‌మన్‌గానే మనకు తెలిసిన రాహుల్ ద్రవిడ్‌లో పార్ట్‌టైమ్ బౌలర్ కూడా ఉన్నాడని మీకు తెలుసా? అవునా అని ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే చాలా తక్కువగానే బౌలింగ్ చేసిన ఇతడు.. అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ వికెట్లే తీయడం విశేషం. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- చెప్పిన తేదీకే రిలీజ్?...
ఇటీవల తిరిగి ప్రారంభమైన 'ఆర్ఆర్ఆర్'(RRR) షూటింగ్ ఫుల్ స్పీడ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. హీరోలు రామ్‌చరణ్, ఎన్టీఆర్‌పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. జులై చివరి నాటికి షూటింగ్ ముగించి, చెప్పిన తేదీకే థియేటర్లలోకి సినిమాను తీసుకురావాలని చిత్రబృందం భావిస్తోంది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.