ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్ ​@10am - telangana top news

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news @10am
టాప్​ టెన్​ న్యూస్ ​@10am
author img

By

Published : May 26, 2020, 10:00 AM IST

ఒక్కరోజులో..

దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 6,535 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 1,45,380కి చేరుకుంది. ఎంత మంది మరణించారంటే?

విష ప్రయోగం..

మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం శ్రీరాంపూర్​లో 8 నెమళ్లు మృతి చెందాయి. వేటగాళ్లే విష ప్రయోగం చేశారా?

గొడవ గొడవ..

తిరుమల శ్రీవారి స్థిరాస్తులను విక్రయించాలన్న తితిదే నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలోనే ఆస్తుల విక్రయ తీర్మానాన్ని పునఃసమీక్షించాలని ప్రభుత్వ నిర్ణయించింది. నిపుణులు ఏమంటున్నారంటే!

హైకోర్టు సీరియస్..

పుప్పాలగూడలోని చెరువులో, మూసీ నదిలో ఆక్రమణలను అనుమతించరాదని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. నివేదిక సమర్పించాలని ఏజీకి ఆదేశాలు జారీచేసింది.

అలా కుదరదు!

సామర్థ్యానికి మించి ప్రయాణికులను బస్సుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని ఆర్టీసీ నిర్ణయించింది. ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంటే ఏం చేయబోతున్నారు?

'గుండె వైరిస్​'

తుపాను వెలిసిందని సంతోషించాలా? వాటిల్లిన నష్టాన్ని తలచుకొని విచారించాలా? కొవిడ్‌-19 ఇప్పుడిలాంటి సందిగ్ధంలోనే పడేస్తోంది. ముఖ్యంగా చిన్నారులకు, యుక్త వయసు పిల్లలకు పెద్ద సంక్షోభాన్నే తెచ్చిపెట్టింది. అసలు ఈ గుండె వైరస్​ కథేంటి?

కాలుదువ్వుతున్న చైనా..

భారత్​ను అస్థిరతలోకి నెట్టి రక్షణ రంగంపైనే పెట్టుబడులు పెట్టించేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది చైనా. తమకున్న రక్షణ వ్యవస్థ, ఆర్థిక వనరులతో ప్రతి దేశాన్ని శాసించాలని ఊవిళ్లూరుతోంది. డ్రాగన్ ప్రవర్తన ఎలా ఉందంటే?

రూ.5 లక్షల కోట్ల బకాయిలు..

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈలు)కు ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ విభాగాలు, పెద్ద పరిశ్రమలు దాదాపు రూ.5 లక్షల కోట్ల మేర బకాయిపడ్డాయని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు. అప్పులపై కేంద్రం నిర్ణయం ఏంటి?

అన్నీ తీసేసుకుంటా..

టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ నుంచి అన్ని నైపుణ్యాలను తీసుకోవాలనుందని అన్నాడు న్యూజిలాండ్​ కెప్టెన్​ కేన్​ విలియమ్సన్​. కోహ్లి బ్యాటింగ్​పై ఏమని కితాబిచ్చాయంటే..

నిర్మాత ఇంట్లో కరోనా..

తన ఇంట్లో పనిచేస్తున్న ఇద్దరికి కరోనా వైరస్​ సోకిందని ట్విట్టర్​లో వెల్లడించారు బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్​ జోహార్. మరి ఆయన స్వీయనిర్బంధంలో ఉంటున్నాడా?

ABOUT THE AUTHOR

...view details