తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @ 10AM - top ten news @ 10am

ఇప్పటి వరకు ఉన్న ముఖ్యాంశాలు

top ten news @ 10am
టాప్​ టెన్​ న్యూస్​ @ 10am

By

Published : May 13, 2020, 10:01 AM IST

  • 'కూలీ'పోయిన బతుకులు

వలస కూలీలు సొంతూళ్లకు వెళ్లేందుకు అనుమతులిచ్చాక ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు సుమారు 10వేల మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారని అంచనా. ఎన్నో తిప్పలు పడి వివిధ రాష్ట్రాల సరిహద్దులు దాటి సొంతూరు వచ్చినా.. తిరస్కారమే ఎదురవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • బాండ్ల జారీతో నిధులు

రాష్ట్ర ప్రభుత్వం మరోమారు రుణాల ద్వారా నిధులు సమకూర్చుకొంది. బాండ్ల జారీతో 2 వేల కోట్ల రూపాయలను అప్పుగా తీసుకుంది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 6 వేల కోట్ల రూపాయలను రుణంగా తీసుకున్నట్లైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ప్రజా రవాణాకు కసరత్తు..

లాక్ డౌన్ తో బంధీగా ఉన్న ప్రజలకు నెమ్మదిగా సేచ్ఛ లభిస్తోంది. ప్రత్యేక సర్వీసుల పేరుతో రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. రాష్ట్రంలోనూ బస్సులను తిప్పేందుకు టీఎస్‌ఆర్టీసీ కసరత్తు ప్రారంభించింది. ప్రజారవాణా ప్రారంభంపై ఒకటి, రెండు ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుంచారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మైక్రోమ్యాక్స్‌లో..

మైక్రోమ్యాక్స్‌ సంస్థతో తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ టీవర్స్క్ అత్యాధునిక వెంటిలేటర్ల తయారీకి ఒప్పందం కుదుర్చుకుంది. త్వరలోనే మైక్రోమ్యాక్స్‌ వీటి ఉత్పత్తిని చేపడుతుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • వాటాలను తీసుకోవడం లేదు

రాయలసీమ ప్రాంతానికి తాగునీటిని అందించేందుకు మాత్రమే శ్రీశైలం నుంచి నీటిని తరలించేలా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టినట్లు ఏపీ విశ్రాంత ఇంజినీర్ల సంఘం స్పష్టం చేసింది. వరద జలాల సమర్థ మళ్లింపే ఈ పథకం ఉద్దేశం అని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

  • కరోనా పంజా

రోనా మహమ్మారి దేశంలో క్రమంగా విస్తరిస్తోంది. గత 24 గంటల్లో 122 మంది వైరస్​ బారిన పడి మరణించారు. కొత్తగా 3,525 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 74 వేలు దాటింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'కరోనా' బ్రేకులు

లాక్‌డౌన్‌ కారణంగా మూడింట రెండోవంతు ప్రజలు ఉద్యోగాలు కోల్పోయారని ఓ సర్వేలో తేలింది. లాక్​డౌన్​ దుష్ప్రభావాలపై పౌరసేవా సంస్థల సహాయంతో అజీమ్ ప్రేమ్​జీ విశ్వవిద్యాలయం.. 12 రాష్ట్రాల్లో సర్వే నిర్వహించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మార్కెట్ జోష్​

దేశీయ స్టాక్​మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రధాని మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీ మార్కెట్లను పరుగులు పెట్టిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • సలహాలు ఇచ్చేవారే లేరు

టీమ్​ఇండియాలో ఆటగాళ్ల వ్యక్తిత్వాన్ని బట్టి ఒక్కొక్కరితో ఒక్కోలా వ్యవహరించాలన్నాడు భారత మాజీ క్రికెటర్​ యువరాజ్​ సింగ్. క్రికెటర్లతో మాట్లాడేందుకు, సలహాలు ఇచ్చేందుకు ప్రస్తుతం ఎవరూ లేరని తెలిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • అజిత్​తో తలైవా ఢీ​!

సూపర్​స్టార్​ రజనీకాంత్​ హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'అణ్ణాత్త'. ఈ సినిమా విడుదలను వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా వేసినట్లు నిర్మాణసంస్థ తాజాగా ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details